twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vijay Varisu Business: రికార్డు స్థాయిలో బిజినెస్ చేస్తున్న విజయ్ 'వారసుడు'.. దిల్ రాజు సేఫ్ డీల్!

    |

    సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో విజయ్ ఒకరు. అతనికి బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్ లేకపోయినప్పటికీ కూడా కేవలం సౌత్ లోనే అతను దాదాపు 300 కోట్లకు పైగా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడం విశేషం. ఇక ఇప్పుడు సంక్రాంతికి రాబోయే వారసుడు సినిమా కూడా అంతకుమించి అనేలా రికార్డు క్రియేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు చాలా సేఫ్ గా టేబుల్ ప్రాఫిట్ వచ్చే విధంగా ఈ సినిమా డీల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

    పెరుగుతున్న విజయ్ మార్కెట్

    పెరుగుతున్న విజయ్ మార్కెట్

    విజయ్ గత 15 ఏళ్ళుగా చూసుకుంటే ప్రతి సినిమాతో కూడా తన మార్కెట్ను పెంచుకుంటూ వెళుతున్నాడు. మినిమం 200 కోట్లు లేదా 300 కోట్లు అనే విధంగా విజయ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక తెలుగులో కూడా అతనికి మెల్లగా మార్కెట్ పెరుగుతూ ఉండడం విశేషం. చివరగా వచ్చిన బీస్ట్ నిరాశపరిచినప్పటికీ అంతకు ముందు వచ్చిన మాస్టర్ అయితే తెలుగులో మంచి కలెక్షన్స్ అందుకుంది.

     బాక్సాఫీస్ కాంబినేషన్

    బాక్సాఫీస్ కాంబినేషన్

    ఇక దిల్ రాజు విజయ్ తో సినిమా చేస్తున్నాడు అనగానే తెలుగులో మరింత అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు మహర్షి సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి పూర్తి కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.

    కెరీర్ బిగ్గెస్ట్ రెమ్యునరేషన్

    కెరీర్ బిగ్గెస్ట్ రెమ్యునరేషన్

    వారసుడు సినిమా కోసం విజయ్ పారితోషికమే దాదాపు 90 కోట్లు తీసుకున్నట్లుగా టాక్ వచ్చింది. జిఎస్టి తో కలిపి ఆ లెక్క 100 కోట్లకు కూడా చేరినట్లు కథనాలు కూడా వచ్చాయి. విజయ్ అయితే తన కెరీర్లో మొదటిసారి అత్యధిక స్థాయిలో ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇది సెన్సేషన్ రికార్డు అని చెప్పవచ్చు.

    బిగ్ బడ్జెట్ మూవీ

    బిగ్ బడ్జెట్ మూవీ

    వారసుడు సినిమా కోసం నిర్మాత దిల్ రాజు కూడా భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ పారితోషకంతో కలిపి సినిమా బడ్జెట్ మొత్తం కూడా దాదాపు 250 కోట్లకు చేరినట్లు సమాచారం. ఒక విధంగా దిల్ రాజు కెరీర్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం.

    వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంతంటే?

    వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంతంటే?

    అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ గా అలాగే వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ అన్ని కలుపుకుని భారీ స్థాయిలో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బిజినెస్ డీల్స్ అయితే క్లోజ్ కాలేదు. ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో సొంతంగా విడుదల చేసుకునే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలను మినహాయించి ఈ సినిమా 280 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందట. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ లెక్కలను కూడా కలిపితే ఆ లెక్క 300 కోట్లకు వెళ్లే అవకాశం ఉంటుంది.

    English summary
    Superstar Vijay varisu movie worldwide total pre release bussiness
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X