వర్మ షాక్ నుంచి కోలుకుంటున్న సురేష్ కొండేటి మళ్ళీ....
గతంలో హరీష్ శంకర్ దర్సకత్వంలో వర్మ కార్పోరేషన్ పై నిర్మించిన షాక్ చిత్రానికి సురేష్ కొండేటి ప్రొడ్యూస్ చేసి భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.ఇప్పుడిప్పుడే కోలుకుని తమిళంలో విజయవంతమైన షాపింగ్ మాల్ చిత్రాన్ని తెలుగుకి అందించారు. ఆ తర్వాత ఇప్పుడు....విక్రమ్ నటించిన 'నాన్న" డబ్బింగ్ తో మరోసారి తెరపైకి వచ్చారు.
భారీ అంచనాలున్న 'నాన్న" సినిమా తెలుగు హక్కుల కోసం చాలామంది నిర్మాతలు పోటీపడ్డారు. కానీ చివరకు 'నాన్న" హక్కులను ప్రముఖ నిర్మాత మళ్ళ విజయప్రసాద్, సంతోషం స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ అధినేత సురేష్ కొండేటి సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు మీడియాకు తెలియపరిస్తూ.....'తమిళంలో విజయ్ దర్శకత్వంలో వచ్చిన కిరీడం, పొయ్ సొల్ల పోరోమ్ చిత్రాలు కమర్షియల్ విజయాలను సొంతం చేసుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆయన దర్శకత్వంలో వస్తున్న మూడో సినిమా ఇది.
పైగా ఇందులో విక్రమ్ హీరో కావడంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందిన సినిమా ఇది. విక్రమ్ నటన ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమా ద్వారా మరోసారి ఆయన జాతీయస్థాయి అవార్డు రావడం ఖాయం అన్నారు.ఈ చిత్రానికి. ఎల్.విజయ్ దర్శకుడు. అనుష్క, అమలా పాల్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











