Happy Birthday Suriya: తెలుగులో స్టార్స్ తో సమానంగా సూర్య బాక్సాఫీస్ కలెక్షన్స్.. వ్వాటే క్రేజ్!
తెలుగు చిత్ర పరిశ్రమలు ఎంతో కాలంగా తమిళ హీరోలు కూడా వారి కంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ను అయితే క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు మంచి కంటెంట్ తో వచ్చిన ప్రతి ఒక్క హీరో కూడా తెలుగులో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలోనే విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక అలాంటి టాలెంటెడ్ నటులలో సూర్య ఒకరు ఆయన కూడా దాదాపు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయిపోయారు. ఇక రీసెంట్ గా నేషనల్ అవార్డ్ అందుకోవడంతో ఎక్కువగా తెలుగు సినీ ప్రముఖులు తెలుగు ప్రేక్షకులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక గతంలో సూర్య తెలుగు సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎలా ఉండేవి అలాగే ఇప్పుడు ఏ స్థాయిలో పడిపోయాయి అనే వివరాల్లోకి వెళితే..

హ్యాపీ బర్త్ డే సూర్య
నేడు సూర్య పుట్టినరోజు కూడా కావడంతో చాలామంది ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగులో కమలహాసన్ రజనీకాంత్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న తమిళ హీరోల్లో సూర్య టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. ఇక నేడు సూర్య పుట్టినరోజు కావడంతో తెలుగు ప్రేక్షకుల సైతం సూర్య ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

తెలుగులో అలా మంచి గుర్తింపు
గతంలో సూర్య కొన్ని మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా దగ్గరయిపోయాడు. అతను నటించిన శివపుత్రుడు సినిమా తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకుంది. బాలా దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో ప్రధాన హీరో విక్రమ్ అయినప్పటికీ అతనితో పాటు సూర్యకి కూడా మంచి క్రేజ్ అయితే దక్కింది. ఆ సినిమాతో అతను ముంచి వచ్చిన ఆరు సినిమా కూడా తెలుగులో పరవాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ అందుకుంది.

గజిని ఊహించని కలెక్షన్స్
ఇక మొదటిసారి తెలుగులోనే సూర్యకు మంచి మార్కెట్ ఏర్పడింది అంటే అది గజినీ సినిమాతోనే. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజినీ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. 2005లో వచ్చిన గజిని సినిమా తెలుగులో 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని అప్పట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆ సినిమాకు 30కోట్లు
ఇక ఆ తర్వాత మరికొన్ని సినిమాలతో కూడా సూర్య తెలుగులో అభిమానుల సంఖ్యను మరింత పెంచుకుంటూ వచ్చాడు. ఇక గజిని తర్వాత మురగదాస్ కాంబినేషన్లోనే 2011లో వచ్చిన 7th సెన్స్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. ఆ సినిమా యావరేజ్ టాక్ ను అందుకున్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

24 బాక్సాఫీస్ హిట్
ఇక విక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 24 సినిమా కూడా తమిళనాడులోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదట మహేష్ బాబుతో చేయాలని అనుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక విక్రమ్ కె కుమార్ సూర్యతో రెండు భాషల్లో తెరపైకి తీసుకువచ్చి కమర్షియల్ గా సక్సెస్ అయితే అందుకున్నాడు. ఆ సినిమా దాదాపు తెలుగులోనే 30 కోట్ల వస్తువులను అందుకుంది.

5కోట్లకు పడిపోయిన కలెక్షన్స్
ఇటీవల కాలంలో మాత్రం సూర్య తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా అనుకున్నంతగా సక్సెస్ అయితే అందుకోలేకపోతున్నాడు. ఆకాశం నీ హద్దురా సినిమా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. ఒకవేళ కరోనా లేకుండా ఉండి సినిమాను థియేట్రికల్ గా విడుదల చేసి ఉంటే తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునేది.
చివరగా థియేట్రికల్ గా వచ్చిన బందోబస్థ్, ET సినిమాలు బాక్సాఫీస్ వద్ద 5కోట్లు కూడా రాబట్టలేదు.ఇక నెక్స్ట్ సూర్య బాల దర్శకత్వంలో అచలుడు అనే సినిమాతో రాబోతున్నాడు. అలాగే శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. మరి ఆ సినిమాలతో అయినా సూర్య ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











