Suriya ET 4 Days Collections: 4 రోజుల్లో దారుణంగా.. తెలుగులో ఎంతకు కొన్నారు? ఎంత వచ్చిందంటే!
విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో దక్షిణాది మొత్తంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతంచేసుకున్న హీరో సూర్య. కెరీర్ ఆరంభంలో కమర్షియల్ సినిమాల్లో మాత్రమే నటించిన అతడు.. క్రమంలోనే ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు. దీంతో విజయాల సంఖ్య తగ్గినా నటుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.
ఈ క్రమంలోనే ఇటీవల 'ఆకాశమే హద్దురా', 'జై భీమ్' అనే చిత్రాలతో తన స్థాయిని మరింతగా పెంచుకున్నాడు. ఇక, ఇప్పుడు సూర్య 'ఈటీ' అనే సినిమాతో వచ్చాడు. గత వారమే విడుదలైన ఈ మూవీ నెగెటివ్ టాక్‌ను తెచ్చుకోవడంతో కలెక్షన్లను అంతగా రాబట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో తెలుగులో ఇది ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

‘ఈటీ' అంటూ వచ్చిన సూర్య
సౌతిండియా స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే ‘ఈటీ - ఎవరికీ తలవంచకు'. పాండిరాజ్ తెరకెక్కించిన ఈ మాస్ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించాడు. వినయ్ రాయ్, సత్యరాజ్, సూరి తదితరులు కీలక పాత్రలను పోషించారు.

ఈటీ తెలుగు బిజినెస్ వివరాలు
సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ‘ఈటీ'కి భారీ బిజినెస్ జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ, రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమా ఒకరోజు ముందే విడుదల కాబోతుండడంతో.. దీన్ని కేవలం రూ. 3.50 కోట్లకే కొనుగోలు చేశారు. అయితే, ఈ సినిమాను మాత్రం ఊహించని విధంగా 450 థియేటర్లతో రిలీజ్ చేశారు.

టాక్‌కు తగ్గట్లుగానే ఈటీ కలెక్షన్లు
తెలుగులోనూ సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు ‘ఈటీ' మూవీ మాస్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చింది. అయితే, ఆరంభం నుంచే ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా చాలా థియేటర్లలో విడుదల అయినా.. కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. పైగా, ఆ తర్వాత రాధే శ్యామ్ విడుదల కావడంతో దీనిపై భారీ స్థాయిలో ప్రభావం పడి కలెక్షన్లు తగ్గిపోయాయి.

4వ రోజు కొంత పెరిగిన కలెక్షన్లు
మొదటి రోజు ‘ఈటీకి' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. కానీ, రెండు, మూడు రోజులు మాత్రం వసూళ్లు పడిపోయాయి. దీనికి కారణం ‘రాధే శ్యామ్' మూవీ విడుదల కావడంతో ఈ సినిమాకు థియేటర్లు తగ్గిపోవడమే. ఆదివారం మాత్రం సూర్య సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 30 లక్షలు పైగానే షేర్ వసూలు అయిందని ట్రేడ్ వర్గాల టాక్.

4 రోజల్లో ఎంత వసూలు చేసింది
4 రోజులకు ‘ఈటీ' మూవీకి ఏపీ తెలంగాణలో మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 51 లక్షలు, సీడెడ్‌లో రూ. 27 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 22 లక్షలు, ఈస్ట్‌లో రూ. 17 లక్షలు, వెస్ట్‌లో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 16 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో కలిపి.. రూ. 1.70 కోట్లు షేర్, రూ. 3.25 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.
Recommended Video


బ్రేక్ ఈవెన్ ఇలా.. ఎంత రావాలి?
తెలుగులో కూడా భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ‘ఈటీ' మూవీకి రెండు రాష్ట్రాల్లో రూ. 3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 1.70 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మరో రూ. 2.30 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











