Suriya ET Telugu bussiness: రాధేశ్యామ్ ముందు చిట్టెలుక లాంటి టార్గెట్.. తేడా వస్తే కష్టమే?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ టాలెంటెడ్ హీరోలలో సూర్య ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ హీరో ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక పాయింట్ మాత్రం చాలా హైలెట్ గా ఉంటుంది. ఇటీవల జై భీమ్ సినిమాతో సూర్య మరోసారి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. ఇక తదుపరి సినిమాను థియేటర్లలో విడుదల చేసి బాక్సాఫీస్ వినాయన్ని అందుకోవాలి అని చూస్తున్నాడు.

పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ యాక్షన్ ఫిలిం ఈటీ ఎవరికీ తలవంచకు అనే సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా తెలుగులో ఏ స్థాయిలో బిజినెస్ చేసింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్

తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సూర్య కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా బయోపిక్ సినిమాలను అలాగే ఎన్నో ప్రయోగాత్మకమైన డిఫరెంట్ సినిమాలను చేస్తూ సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఒక విధంగా అతనికి తమిళంలో కంటే తెలుగులోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి. గతంలో తెలుగులో సూర్య చాలా మంచి విజయాలను అందుకున్నాడు.

ఆ సినిమాలకు పాజిటివ్ టాక్

ఆ సినిమాలకు పాజిటివ్ టాక్

కానీ ఇటీవల కాలంలో సూర్య టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. కానీ డిజిటల్ లో వచ్చిన సినిమాలు మాత్రం మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ అందమైన సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయి ఉంటే ఇంకా మంచి విజయాన్ని అందుకునేవి. ఇక ఈసారి ET సినిమాతో సాలిడ్ సక్సెస్ ని చూడాలి అని సూర్య సిద్ధమయ్యాడు.

పాండిరాజ్ దర్శకత్వంలో..

పాండిరాజ్ దర్శకత్వంలో..

కమర్షియల్ సినిమాల్లో ఏదో ఒక మంచి సోషల్ మెసేజ్ పాయింట్ ను హైలెట్ చేసే తమిళ దర్శకుడు పాండీరాజ్ కూడా ఒకరు. ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిందే ఈ సినిమా. సూర్య మరోసారి విభిన్నమైన సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ఈటి అనే సినిమాను తెలుగు లో ఎవరికీ తలవంచకు అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.

రాధే శ్యామ్ ప్రభావం

రాధే శ్యామ్ ప్రభావం

ఈటీ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతోంది. అయితే ఒక రోజు గ్యాప్ లోనే మార్చి 11వ తేదీన ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఒక విధంగా తెలుగులో అయితే సూర్య సినిమాకు గట్టి పోటీ ఎదురవుతోంది అని చెప్పవచ్చు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను చూడాలి అని ప్రేక్షకులు ఫోకస్ మొత్తం ఫస్ట్ డే రోజు అడ్వాన్స్ బూకింగ్స్పై ఫోకస్ పెట్టారు. ఈ హడావిడిలో సూర్య సినిమా విడుదలవుతోంది అనే విషయం కూడా చాలామందికి తెలియదు.

 తెలుగులో బిజినెస్ ఎంతంటే?

తెలుగులో బిజినెస్ ఎంతంటే?

అయితే ఈ సినిమా ఏ స్థాయిలో బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. గతంలో కంటే సూర్య ఈసారి తెలుగులో చాలా తక్కువ టార్గెట్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నైజాం ఏరియాలో ఈ సినిమా 1.2 కోట్ల బిజినెస్ చేయగా సీడెడ్ లో 80 లక్షలు ఆంధ్రాలో 1.5 కోట్లు వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

Latest Film Updates : Jai Bhim చిత్రం వివాదం Suriya పై ఆ సంస్థ సంచలన ప్రకటన! || Filmibeat Telugu
బ్రేక్ ఈవెన్ టార్గెట్..

బ్రేక్ ఈవెన్ టార్గెట్..

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఈటీ ఎవరికీ తలవంచకు సినిమా 3.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలంటే తప్పకుండా నాలుగు కోట్లకు పైగానే రాబట్టాల్సి ఉంటుంది. కానీ రాధేశ్యామ్ సినిమాకు టాక్ పాజిటివ్ గా మొదలైతే మాత్రం సూర్య సినిమాకు ఇబ్బందులు తప్పవు. మరి సూర్య ఎంతవరకు నిలదొక్కుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X