Retro Day 5 Collections : సూర్యకు సవాల్.. రెట్రో 5 రోజుల కలెక్షన్లు.. ఇలాగైతే టార్గెట్ దాటేనా?
కోలీవుడ్ అగ్ర హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'రెట్రో'. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ లు నిర్మించారు. మే1న రెట్రో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ బెల్ట్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలో రెట్రో బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 5 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయి? ఇంకెంత రాబట్టాలి? అనే వివరాల్లోకి వెళితే..
రెట్రో చిత్రం బడ్జెట్ (Retro Budget) ఎంత?
రెట్రో.. సూర్య 45వ చిత్రం. పైగా స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్దే, శ్రియా శరణ్ తోపాటు ప్రముఖ నటీనటులు సినిమాలో నటించారు. ప్రముఖ టెక్నీషియన్లు కూడా ఈ సినిమాకు పనిచేశారు. ఇలా రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు, ప్రమోషన్ ఖర్చులు కలుపుకొని రూ.65 కోట్ల బడ్జెట్ అయ్యింది.

రెట్రో బ్రేక్ ఈవెన్ (Retro Break Even Target) టార్గెట్ ఎంత?
రెట్రో చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే వసూల్ చేసింది. తమిళనాడు రైట్స్ రూ.40 కోట్లు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 18 కోట్లు, తెలుగులో రూ.9.50 కోట్లు.. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ.80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక లాభాల్లోకి రావాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ.165 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.
రెట్రో ఓవర్సీస్ (Retro Overseas Collections)
రిలీజ్ కు ముందు రోజు 24 గంటల్లోనే తమిళంలో 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక ఓవర్సీస్ లో ఫస్ట్ డే యూకేలో అడ్వాన్డ్ బుకింగ్స్ ద్వారా 3200 టికెట్లు అమ్మగా 34,246 డాలర్ల వసూళ్లు సాధించింది. ఇలా ప్రీసేల్ ద్వారా రూ.16 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక ఓవర్సీస్ లో డే1 రూ.9.50 కోట్లు, 2వ రోజు రూ.2.60 కోట్లు, 3వ రోజు రూ.5.10 కోట్లు, 4వ రోజు రూ.4.6 కోట్ల వరకు వసూళ్లు అందింది. 4 రోజుల్లో రూ.22.6 కోట్లు కలెక్ట్ చేసింది.
రెట్రో గత 4 రోజుల కలెక్షన్స్ (Retro Day 4 Collections)
భారీ అంచనాలతో వచ్చిన రెట్రో చిత్రానికి అంతంత మాత్రంగానే రెస్పాన్స్ ఉంది. అయినా సూర్యకు ఉన్న క్రేజ్ తో వసూళ్లు బాగానే అందుతున్నాయి. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.32.25 కోట్ల గ్రాస్ అందింది. 2వ రోజు రూ.8 కోట్ల గ్రాస్, 3వ రోజు రూ.19 కోట్ల వరకు వసూళ్లు చేసింది. 4వ రోజు రూ.8.85 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.73.50 కోట్ల గ్రాస్ అందుకుంది.
రెట్రో 5వ రోజు కలెక్షన్లు..
సూర్యకు ఉన్న క్రేజ్ వల్ల బాక్సాఫీస్ కలెక్షన్లు ప్రస్తుతానికి బాగానే అందుతున్నాయి. రెట్రో 5వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ ఓవరాల్ గా 23 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక 5వ రోజు ఇండియా నెట్ రూ.3.35 కోట్లు వసూల్ చేసింది. తమిళంలో రూ.2.94 కోట్ల నెట్, తెలుగులో రూ.44 లక్షలు, హిందీలో రూ.5 లక్షలు వసూల్ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఇండియా నెట్ రూ.46.53 కోట్లకు చేరుకుందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. రూ.55 కోట్ల వరకు గ్రాస్ చేరుకుంది. ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని 5రోజుల్లో రూ.80 కోట్ల వరకు గ్రాస్ వసూళ్ల చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ఇంకా రూ.85 కోట్లకు పైగానే గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంది. స్టార్ హీరోల చిత్రాలు మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేస్తూ ఉంటాయి. కానీ సూర్య రెట్రో మాత్రం బాక్సాఫీస్ వద్ద కాస్తా పడుతూ లేస్తూ ఉంది. దీంతో సూర్యకు ఈ మూవీ బ్రేక్ ఈవెట్ టార్గెట్ పూర్తి చేయడం సవాల్ గానే మారిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











