twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికవరీ కష్టమే... ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : తమిళ హీరో సూర్య తాజా చిత్రం మాస్..తెలుగులో 'రాక్షసుడు' గా మొన్న శుక్రవారం రిలీజైంది. అయితే మార్నింగ్ షో కే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రీ రిలీజ్ కు అరవై కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్లు ని ఫస్ట్ వీకెండ్ మూడు రోజుల్లో సాధించింది. మతరో 34 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ రాదు. కానీ తమిళంలో యావరేజ్ , తెలుగులో ఫ్లాఫ్ గా నమోదైన ఈ చిత్రం కలెక్షన్స్ రెండు వారాలు పాటు స్టడీగా ఉంటేనే ఆ అద్బుతం జరుగుతుంది. కానీ ఆ పరిస్ధితి కనపడటం లేదు.

    రాక్షసుడు మొదటి వారం కలెక్షన్స్ (గ్రాస్):

    తమిళనాడు:రూ 17.30 కోట్లు

    ఎపి & నైజాం:రూ 4.5 కోట్లు

    కర్ణాటక:రూ 3.10 కోట్లు

    కేరళ:రూ 3 కోట్లు

    భారత్ లో మిగతా ప్రాంతాలు:రూ 0.55 కోట్లు

    ఓవర్ సీస్ :రూ 16 కోట్లు

    రాక్షసుడు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (గ్రాస్):రూ 44.45 కోట్లు

    ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ..(షేర్):రూ 26 కోట్లు (ఉజ్జాయింపుగా)

     Suriya's Rakshasudu First Weekend Collections

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ చిత్రం కథేమిటంటే...సూర్య, ప్రేమ్ జీ ఇద్దరూ చిన్న సైజు దొంగలు. వారు దొంగతనాలు చేసుకుంటూ జీవితం గడువుతూంటే ఓ రోజు అనుకోని విధంగా ప్రేమ్ జీ చనిపోతాడు. దాంతో సూర్య డల్ అయిపోతాడు.తర్వాత కొద్ది రోజులుకు అతనికి ప్రేమ్ జీ కనపడటం ప్రారంభిస్తాడు. అప్పుడు సూర్యకు అర్దమవుతుంది...తనకు దెయ్యాలను చూసే పవర్ వచ్చిందని. కొద్ది రోజులుకే అతను చాలా దెయ్యాలను చూడటం మొదలెడతాడు. అవన్ని తమ తమ సమస్యలకు అతన్ని పరిష్కారం అడుగుతూంటాయి.

    సూర్య దొంగతనాలు ఆపేసి...ఆ దెయ్యాలను రకరకాల ఇళ్లకు పంపి..వాటిని తరిమేస్తూ..డబ్బు సంపాదిస్తూంటాడు. అయితే ఓ రోజు ఓదెయ్యాన్ని ఓ ఇంటినుంచి తరుముదామని వెళితే అక్కడ షాక్ కు గురి అవుతాడు. అక్కడ ఉన్న దెయ్యం...అచ్చం అతని పోలికలోనే ఉంటుంది. అక్కడ నుంచి ఏం జరుగుతుంది. అసలు ఈ దెయ్యాలు గోల ఏంటి...తన పోలికలతోనే ఉన్నవాడు ఎవరు అనేది తెలుసుకోవాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

    దర్శకుడు మాట్లాడుతూ... రాక్షసుడంటే నెత్తిమీద రెండు కొమ్ములు, నిప్పులు చిమ్మే కళ్లు, బయటకొచ్చిన పళ్లూ, ఒళ్లంతా రక్తం ఇవేం వూహించుకోకండి. ఇతనో స్త్టెలిష్‌ రాక్షసుడు. ప్రేమిస్తాడు, స్నేహం చేస్తాడు, మంచి కోసం ప్రాణాలిస్తాడు. కానీ అతన్ని అంతా 'రాక్షసుడు' అని పిలుచుకొన్నారు. కారణమేంటో తెలియాలంటే 'రాక్షసుడు' సినిమా చూడాల్సిందే అన్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ ''సూర్య ప్రయాణం ముందు నుంచీ వైవిధ్యభరితంగానే సాగుతోంది. 'గజిని', 'సింగం' లాంటి చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకొన్నారు. 'రాక్షసుడు' ఆ చిత్రాల జాబితాలో చేరుతుంది. ఈ చిత్రంలో సూర్య విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారు. ఆయన పాత్ర పెద్దలకే కాదు, పిల్లలకూ నచ్చుతుంది. హారిస్‌ జైరాజ్‌ అందించిన బాణీలకు చక్కటి స్పందన వస్తోంది''అన్నారు.

    English summary
    Suriya starrer 'Rakshasudu' 'Rakshasudu' managed a share of just Rs 26 cr in the first three days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X