Suriya 42: RRR డిస్ట్రిబ్యూటర్స్ చేతికి సూర్య సినిమా.. ఆ ఒక్క భాషలోనే 100 కోట్ల డీల్!

ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా చాలామంది హీరోలు మార్కెట్ ను దేశవ్యాప్తంగా పెంచుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది విదేశాల్లో కూడా కోట్లలో మార్కెట్ను విస్తరింప చేసుకుంటున్నారు. ఒక స్టార్ హీరో మార్కెట్ అనేది ఇప్పుడు వివిధ రకాల రూపాల్లో మారుతోంది. ముఖ్యంగా థియేట్రికల్ బిజినెస్ కంటే కొన్ని సినిమాలు నాన్ థియేట్రికల్ గా కూడా మంచి ప్రాఫిట్ అందిస్తున్నాయి. దీంతో వారి రెమ్యునరేషన్ కూడా అమాంతంగా పెరిగిపోతోంది.

అయితే కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ హీరో సూర్య రేంజ్ కూడా ఇటీవల కాలంలో మెల్లమెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో ఒక బిగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేస్తున్నాడు. పూర్వజన్మల కాన్సెప్ట్ నిబద్యంలో తెరపైకి రాబోతున్న సినిమాలో సూర్య మూడు విన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడట. ఇక ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ పనులను పూర్తి చేసి సినిమాను ఇదే ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

Suriya upcoming action adventure movie shocking business deal in hindi market

అయితే సూర్య సినిమా గురించి తెలుసుకున్న పెన్ స్టూడియోస్ అధినేతలు హిందీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు ఈ సంస్థ RRR సినిమాను హిందీ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సూర్య 42వ సినిమాకు సంబంధించిన హిందీ థియేట్రికల్ హక్కుల తో పాటు శాటిలైట్ ఓటీటీ హక్కులను కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

Suriya upcoming action adventure movie shocking business deal in hindi market

అందుకోసం వారు ఒకేసారి 100 కోట్లు ఆఫర్ చేసినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమాపై అంచనాలు అయితే తమిళంలో భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు హిందీ హక్కులు కూడా ఊహించని రేటుకు అమ్ముడు పోవడంతో సౌత్ ఇండస్ట్రీలో మొత్తంలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతవరకు ఏ తమిళ హీరో కూడా ఆ స్థాయిలో హిందీలో అయితే రికార్డు క్రియేట్ చేయలేదు. మరి సూర్య సినిమా హిందీ ఆడియోన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X