Kanguva Box Office Collections: రజనీ, అజిత్, ధనుష్ రికార్డులపై సూర్య గురి.. కంగువాకు ఎన్ని కోట్లంటే?
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కంగువ సినిమా రిలీజ్‌కు ముందే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి సిద్దమైంది. కొద్ది రోజులు క్రితం ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన కనిపిస్తున్నది. సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ తదితరులు నటించిన ఈ సినిమా అంచనాల మించి బజ్ క్రియేట్ చేస్తున్నది.
ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. రిలీజ్‌కు ముందు కంగువ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న వివరాల్లోకి వెళితే..

తమిళనాడులో కంగువ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. రెండు రోజుల ముందు మొదలైన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన రావడంతో తొలి రోజే ధనుష్ నటించిన రాయన్ సినిమా రికార్డులను, అలాగే అజిత్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. ఇంకా ప్రీమియర్లకు ముందు భారీగా బుకింగ్స్ నమోదు అవుతున్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కేరళలో ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా వెట్టయాన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ రికార్డులకు దాదాపు సమానంగా నిలిచాయి. ది గోట్ సినిమా తర్వాత రెండో అతిపెద్ద కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టినట్టు తెలుస్తున్నది. ఇక కర్ణాటకలో ఈ సినిమా 1 కోటి రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా నమోదు చేసింది.
ఇక హిందీలో కంగువాకు సానుకూలమైన స్పందన కనిపిస్తున్నది. అయితే ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసినప్పటికీ నార్త్ ఇండియాలో పెద్దగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు కాకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే కరెంట్ బుకింగ్ ద్వారా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందనే ఆశాభావంతో ట్రేడ్ వర్గాలు ఉన్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కంగువ అడ్వాన్స్ ఊపందుకొన్నాయి. ఈ సినిమా ఆంధ్రా, నైజాం బెటర్‌గా కలెక్షన్లు నమోదు చేస్తున్నది.ఈ చిత్రం రిలీజ్‌కు ముందు 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. అయితె కరెంట్ బుకింగ్ ద్వారా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచాన వేస్తున్నారు.
ఇక కంగువ మూవీ ఇప్పటికే బుక్ మై షో ద్వారా 3 లక్షల టికెట్లను అమ్ముడుపోయాయి. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచాన వేస్తున్నారు. ఈ చిత్రం ధనుష్, రజనీకాంత్, అజిత్ సినిమాల 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ రికార్డును అధిగిమించేందుకు రెడీ అయింది.


Click it and Unblock the Notifications











