twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు రాష్ట్రాల్లో సూర్య ‘NGK’ క్లోజ్... ఎంత లాస్ అంటే?

    |

    సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన 'NGK' చిత్రం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది. తమిళంతో పాటు తెలుగులో మే 31న విడుదలైన ఈ పొలిటికల్ ఎంటర్టెనర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలైంది.

    రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 9 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఫస్ట్ వీకెండ్ బిజినెస్ పూర్తిగా డీలా పడిపోయింది. రెండు వారాలు పూర్తికావడం, ప్రేక్షకుల తాకిడి లేక పోవడంతో అన్ని చోట్ల నుంచి ఎత్తేస్తున్నారు. ఇప్పటి వరకు టోటల్ షేర్ రూ. 4.5 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది.

    సినిమా ప్రదర్శితం అవుతున్న అన్ని ఏరియాల్లోనూ థియేటర్లన్నీ వెలవెలపోతున్నాయి. దీంతో యాభై శాతం నష్టాలతో సినిమా బాక్సాఫీస్ రన్ క్లోజ్ చేశారు. నైజాంలో రూ. 1.20 కోట్లు, సీడెడ్లో రూ. 77 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 75 లక్షలు, గుంటూరులో 49 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, కృష్ణలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలు వసూలు చేసింది.

    Suryas NGK movie Telugu business end

    సినిమా ఫెయిల్యూర్‌ను స్వీకరిస్తూ సూర్య ఇప్పటికే ట్వీట్ చేశారు. 'NGK సినిమా విషయంలో అందరి అభిప్రాయాలను వినయంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సినిమా లోపాలను ఎత్తి చూపడంతో పాటు, డిఫరెంట్ అటెమ్ట్ చేసినందుకు ప్రశంసించిన మాస్టర్ మైండ్స్(క్రిటిక్స్)కు ఈ సందర్భంగా సూర్య థాంక్స్ చెప్పారు.

    ఈ సినిమాలో భాగమైన నటీనటులకు, టెక్నీషియన్లకు, దర్శకుడు సెల్వరాఘవన్, నిర్మాత ఎస్ఆర్ ప్రభుకు సూర్య కృతజ్ఞలు తెలిపారు. సినిమా ప్లాప్ అయిన విషయాన్ని నిజాయితీగా ఒప్పుకున్న సూర్యపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    సూర్య త్వరలో 'కాప్పన్' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కెవి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 30న విడుదల కాబోతోంది. పొలిటికల్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈమూవీలో సూర్యతో పాటు మోహన్ లాల్, ఆర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య ఎస్పీజీ కమెండోగా, మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా, పిఎం కొడుకు పాత్రలో ఆర్య నటిస్తున్నారు.

    English summary
    Surya's NGK movie Telugu business end with share of 4.5 Cr. NGK written and directed by Selvaraghavan. Suriya, Sai Pallavi, and Rakul Preet Singh play the lead roles while Devaraj plays a pivotal role. Yuvan Shankar Raja composed the music and Sivakumar Vijayan was the cinematographer. The film was produced by S. R. Prakashbabu and S. R. Prabhu of Dream Warrior Pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X