twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య వర్సెస్ సూర్య.....11 రోజుల్లో రూ. 11 కోట్లు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నిఖిల్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా సురక్ష్ ఎంటర్టెన్మెంట్స్ ఇండియా ప్రై.లి బ్యానర్లో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య' చిత్రం 11 రోజులకు 11 కోట్ల గ్రాస్ సాధించి సెన్సేషనల్ విజయానికి చేరువైంది.

    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘మా చిత్రం 11 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణ, ఓవర్సీస్ లో కలిసి 11 కోట్ల గ్రాస్ సాధించింది. ముందుగా మా చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఈ రోజు ప్రేక్షకులు అందించిన ఇంతటి ఘన విజయం మా కష్టాన్ని కూడా మరిచిపోయేలా చేసింది. మా చిత్రం తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మా సంస్థ నుండి ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను' అన్నారు.

     Surya vs Surya 11 days total collection

    నిఖిల్, త్రిదా చౌదరి, తనికెళ్ల భరణి, మధువాల, రావు రమేష్, షాయాజీ షిండే, సత్య, తాగుబోతు రమేష్, రాజా రవీంద్ర, ప్రవీణ్, అల్లరి సుభాషిణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, మాటలు: చందు మొండేటి, ఎడిటింగ్: గౌతం నెరసు, ఆర్ట్: టి.ఎన్.ప్రసాద్, కొరియోగ్రఫీ: విజయ్, ఫైట్స్: వెంకట్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, కృష్ణ చిన్ని, సంగీతం: సత్య మహవీర్, నిర్మాత: మార్కాపురం శివకుమార్, రచన-దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.

    English summary
    Surya vs Surya 11 days total collection Rs. 11 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X