For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డ్ క్రియేట్ చేసిన సుశాంత్ సింగ్ ఆఖరి చిత్రం.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్స్..?

    |

    ఒక సినిమా విజయం చిత్ర యూనిట్ లో నింపే సంతోషం అంతా ఇంతా కాదు. అయితే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం ఇప్పుడు విజయం సాధించిన కూడా చిత్ర యూనిట్ లో కన్నీళ్లే దర్శనమిస్తున్నాయి. సుశాంత్ సింగ్ మరణానికి ముందు నటించిన ఆఖరి సినిమా 'దిల్‌ బేచారా' ఇటీవల డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికగా విడుదలైంది. అయితే ఆ సినిమా విడుదలైన కొన్ని గంటలకే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

    సుశాంత్ సింగ్ అప్సెట్

    సుశాంత్ సింగ్ అప్సెట్

    దిల్ బేచారా అసలైతే సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ విషయంలో సుశాంత్ కొంత అప్సెట్ అయినట్లు టాక్ కూడా వచ్చింది. ఇక థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో OTTలో రిలీజ్ కావాల్సి వచ్చింది. ముఖేశ్‌ చబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజనా సంఘీ కథానాయికగా నటించింది.

    24గంటల్లోనే ఇండస్ట్రీ రికార్డ్

    24గంటల్లోనే ఇండస్ట్రీ రికార్డ్

    ఇక ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. డిస్నీ+హాట్‌స్టార్‌ విడుదలైన ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 24గంటల్లోనే 75మిలియన్స్ వ్యూవ్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఓటీటీలో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో వ్యూవ్స్ అందుకోలేదు. ఒకరోజులో అత్యదిక మంది చూసిన సినిమాగా సుశాంత్ తన ఆఖరి సినిమాతో ఆఖరి రికార్డ్ సృష్టించాడు.

     నెంబర్ వన్ ట్రైలర్

    నెంబర్ వన్ ట్రైలర్

    దిల్ బేచారా ట్రైలర్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అత్యదిక లైక్స్ అందుకున్న ట్రైలర్ గా యూట్యూబ్ వరల్డ్ లోనే నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన సినిమా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ కి అన్ని వర్గాల ఆడియెన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు.

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే..

    థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే..

    ఒక వేళ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి ఉండదనే కామెంట్స్ వస్తున్నాయి. ఈజీగా మొదటిరోజే 100కోట్లకు పైగా వసూలు చేసి ఉండేదని బాలీవుడ్ బాక్సాఫీస్ ఎనలిస్ట్ లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సుశాంత్ మరణించిన ఆఖరి సినిమా కావడం అందులోను సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ ఉండడంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతోంది. ఇక దిల్ బేచారా సినిమా ఆల్ టైమ్ బెస్ట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    You have to know what kind of craze a movie has on YouTube. Songs, teaser, trailer, clicks, the response to the movie automatically increases unimaginable. Recently, Sushant Singh Rajput released the last trailer of the film and received a record number of likes. Trailers that have received most viewings in the past have also been followed by his film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X