Don't Miss!
- News మాజీ సీఎం రిలీఫ్, హైకోర్టు ఆదేశాలు, మహిళలనపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు !
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రికార్డ్ క్రియేట్ చేసిన సుశాంత్ సింగ్ ఆఖరి చిత్రం.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్స్..?
ఒక సినిమా విజయం చిత్ర యూనిట్ లో నింపే సంతోషం అంతా ఇంతా కాదు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం ఇప్పుడు విజయం సాధించిన కూడా చిత్ర యూనిట్ లో కన్నీళ్లే దర్శనమిస్తున్నాయి. సుశాంత్ సింగ్ మరణానికి ముందు నటించిన ఆఖరి సినిమా 'దిల్ బేచారా' ఇటీవల డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా విడుదలైంది. అయితే ఆ సినిమా విడుదలైన కొన్ని గంటలకే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
సుశాంత్ సింగ్ అప్సెట్
దిల్ బేచారా అసలైతే సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ విషయంలో సుశాంత్ కొంత అప్సెట్ అయినట్లు టాక్ కూడా వచ్చింది. ఇక థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో OTTలో రిలీజ్ కావాల్సి వచ్చింది. ముఖేశ్ చబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజనా సంఘీ కథానాయికగా నటించింది.
24గంటల్లోనే ఇండస్ట్రీ రికార్డ్
ఇక ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. డిస్నీ+హాట్‌స్టార్ విడుదలైన ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 24గంటల్లోనే 75మిలియన్స్ వ్యూవ్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఓటీటీలో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో వ్యూవ్స్ అందుకోలేదు. ఒకరోజులో అత్యదిక మంది చూసిన సినిమాగా సుశాంత్ తన ఆఖరి సినిమాతో ఆఖరి రికార్డ్ సృష్టించాడు.
నెంబర్ వన్ ట్రైలర్
దిల్ బేచారా ట్రైలర్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అత్యదిక లైక్స్ అందుకున్న ట్రైలర్ గా యూట్యూబ్ వరల్డ్ లోనే నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన సినిమా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ కి అన్ని వర్గాల ఆడియెన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు.
Recommended Video
థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే..
ఒక వేళ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి ఉండదనే కామెంట్స్ వస్తున్నాయి. ఈజీగా మొదటిరోజే 100కోట్లకు పైగా వసూలు చేసి ఉండేదని బాలీవుడ్ బాక్సాఫీస్ ఎనలిస్ట్ లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సుశాంత్ మరణించిన ఆఖరి సినిమా కావడం అందులోను సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ ఉండడంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతోంది. ఇక దిల్ బేచారా సినిమా ఆల్ టైమ్ బెస్ట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.