ఆదివారమే ఆడియో...అప్పుడే టీజర్ కూడా

By Srikanya

హైదరాబాద్ : ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం 'యమలీల 2'. కె.వి.సతీష్‌, దియానికోలస్‌ జంటగా నటించారు. మోహన్‌బాబు, బ్రహ్మానందం కీలక పాత్రధారులు. ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 26న విడుదల చేయనున్నారు. అదే రోజున ఫస్ట్ లుక్ టీజర్ ని సైతం వదల నున్నారు. త్వరలోనే విడుదలకు సైతం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ''వినోదంతో పాటు కమర్షియల్‌ హంగులన్నీ ఉన్న చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ''ని అచ్చిరెడ్డి తెలిపారు.

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ...''రెండు దశాబ్దాల తరవాత యమలీలకు కొనసాగింపుగా ఓ చిత్రం తీసుకొస్తున్నాం. రెండు కథలకూ ఎలాంటి సంబంధం లేదు. కానీ వినోదం మాత్రం అదే స్థాయిలో ఉంటుంది. మన తెలుగు సినిమాల్లో హీరోలు ధీరోదాత్తులు. ఎంతగా అంటే.. తలచుకొంటే యముడినే భూమ్మీదకు తీసుకొచ్చేయగలరు. ఆ తరవాత ఎలాంటి హంగామా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో చిత్రాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. ఇప్పుడు మా చిత్రంలో అంతకు రెట్టింపు వినోదాలు చూస్తాం''అంటున్నారు.

అలాగే... ''యమలీల' వచ్చిన ఇరవయ్యేళ్ల తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. ప్రస్తుత సాంకేతికతతో ఈ చిత్రం కాస్త వైవిధ్యంగా ఉంటుంది. ఎన్టీఆర్‌గారి తర్వాత యముడి పాత్ర మోహన్‌బాబుగారికి బాగా నప్పింది. జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చిన సతీష్‌కి ఈ సినిమా హీరోగా మంచి పేరు తీసుకురావాలి. నా మొదటి సినిమాలా భావించి ఈ సినిమాని రూపొందించాను'' అన్నారు.

SV Krishna Reddy's Yamaleela 2 audio release on Sunday

మోహన్ బాబు మాట్లాడుతూ.... ''యముడి పాత్ర పోషించడం ఓ అదృష్టం. ఈ సినిమా ద్వారా నాకు రెండోసారి ఆ అదృష్టం దక్కింది. దీని తర్వాత మరోసారి యముడి పాత్ర పోషించను. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలతో పని చేస్తుంటే బాపు, రమణతో పని చేస్తున్న అనుభూతి కలిగింది. చిత్ర హీరో సతీష్‌ని చూస్తుంటే 'స్వర్గం - నరకం' సమయంలో నేను ఎలా ఉండేవాడినో గుర్తుకొస్తోంది. సతీష్‌ మంచి నటుడిగా ఎదుగుతాడు'' అన్నారు మోహన్ బాబు.

మోహన్ బాబు యముడిగా నటిస్తున్న 'యమలీల 2' .ఈ సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి. సతీష్‌ హీరోయిన్. దియా నికోలస్‌ హీరోయిన్. క్రిస్వీ ఫిలింస్‌ పతాకంపై సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్... "యమహో నీ యమా యమ అందం..." ని రీమిక్స్ చేయనున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఈ సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపింది. ఇప్పుడు మళ్లీ థియోటర్స్ లో ఈ పాట రేంజిలో క్రేజ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. దానికితోడు మోహన్ బాబు స్టెప్స్ ఏ రేంజిలో ఉంటాయో ఊహించుకోమంటున్నారు. సమర్పణ: డి.ఎస్‌.మాక్స్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X