‘సీతమ్మ వాకిట్లో....’ ఫస్ట్ డే ఏపీ కలెక్షన్స్
హైదరాబాద్: మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం నిన్న గ్రాండ్ గా రిలీజై మంచి ఓపెనింగ్స్ సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు ఈ చిత్రం రూ. 6.54 కోట్లు వసూలు చేసింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈచిత్రానికి హిట్ టాక్ ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో... పండగ మూడు రోజులు అధిక వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ఏరియాల్లో ఈ చిత్రం సాధించి కలెక్షన్స్ ఈక్రింది విధంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుంటే ఈ లెక్క మరో 2 కోట్లు అదనంగా ఉండే అవకావం ఉంది.
నైజాం - 1.8 కోట్లు
సీడెడ్ - 1.16 కోట్లు
వైజాగ్ - 62 లక్షలు
వెస్ట్ గోదావరి - 55 లక్షలు
ఈస్ట్ గోదావరి- 90 లక్షలు
గుంటూరు- 90 లక్షలు
కృష్ణ - 34 లక్షలు
నెల్లూరు - 27 లక్షలు
మొత్తం ఏపీ తొలి రోజు కలెక్షన్స్ షేర్ : 6.54 కోట్లు
చాలా కాలం తర్వాత తెలుగు తెరపై ఓ అచ్చమైన తెలుగు సినిమా వెల్లువరిసింది. హద్దులు దాటిన ప్రేమ పిచ్చి, అసభ్యమైన సన్నివేశాలు, భయం పుట్టించే హింసాత్మక సన్నివేశాలు, ద్వందార్థాలతో వచ్చే చండాలమైన డైలాగులు, బూతు సన్నివేశాలు తప్ప ఈతరం తెలుగు సినిమాల్లో ఇంతకు మించి ఇక ఏమీ ఉండదని, కుటుంబ సమేతంగా చూసే స్వచ్చమైన సినిమాలు ఇక రావేమో అని సగటు కుటుంబ ప్రేక్షకుడు ఆందోళన చెందుతున్న తరుణంలో.... ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు, బంధాలు, బాంధవ్యాలు, సంప్రదాయలు వీటిచుట్టూ అల్లిన అందమైన కథాంశం ఫ్యామిలీ ప్రేక్షక రంజక సినిమా మన ముందుకు వచ్చింది 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.
మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి హీరో హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు నటించిన ఈచిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ: గుహన్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











