‘సీతమ్మ వాకిట్లో...’ 4డేస్ కలెక్షన్ రిపోర్ట్
హైదరాబాద్ : దాదాపు 25 సంవత్సరాల తర్వాత వెంకటేష్, మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్లతో రూపొందిన మల్టీ స్టారర్ సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈచిత్రం వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపే కలెక్షన్లతో దూసుకెలుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈచిత్రం తొలి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.01 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం 'దిల్ రాజు వాకిట్లో డబ్బుల చెట్టు'గా మారిందని అభిమానులు చెప్పుకుంటున్నారు.
'సీతమ్మ వాకిట్లో...' కంటే 2 రోజుల ముందు విడుదలైన 'నాయక్' చిత్రం గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆ చిత్రానికి పోటీగా నిలబడుతుందో లేదో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు చాలా మంది క్రిటిక్స్ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ కితాబిచ్చారు. దీనికి తోడు క్లాస్ పీపుల్ నుంచి కూడా పాజిటివ్ మౌత్ టాక్ వ్యాప్తి చెందడం సినిమాకు కలిసొచ్చింది. వచ్చే రోజుల్లో కూడా సినిమా మరింత పుంజుకునే అవకాశం ఉంది. వీకెండ్, సంక్రాంతి హాలిడేస్ కలిపి ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చి పడ్డాయి.
నైజాంలో రూ. 5.30 కోట్లు, సీడెడ్లో రూ. 3.10 కోట్లు, నెల్లూరులో రూ. 82 లక్షలు, గుంటూరులో 1.83 కోట్లు, కృష్ణాలో 1.19 కోట్లు, వెస్ట్ లో రూ. 1.20 కోట్లు, ఈస్ట్ లో రూ. 1.60 కోట్లు, వైజాగ్ లో రూ. 1.35 కోట్లు, అమెరికాలో రూ. 6.87 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. యూఎస్ బాక్సాఫీసు వద్ద వీకెండ్ కలెక్షన్ చార్ట్ లో ఈ చిత్రం టాప్ లో నిలవడం మరో విశేషం.


Click it and Unblock the Notifications











