SVSC 5రోజుల కలెక్షన్స అదిరాయ్
హైదరాబాద్: చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం కలెక్షన్ల పరంగా మంచి ఫలితాలను సాధిస్తోంది. మహేష్ బాబు, వెంకటేష్, సమంత లాంటి హాట్ ఫేవరెట్ స్టార్స్ ఉండటం, ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేని అచ్చమైన తెలుగు సినిమా కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తున్నారు. వీకెండ్, సంక్రాంతి హాలిడేస్ కలిసి రావడం కూడా సినిమాకు బాగా ప్లస్సయింది. విడుదలైన తొలి ఐదు రోజుల్లో సినిమా కలెక్షన్స్ క్రింది విధంగా ఉన్నాయి.
ఏరియా వారిగా కలెక్షన్స్ వివరాలు
నైజాం - 7.40 కోట్లు
సీడెడ్ - 3.91 కోట్లు
నెల్లూరు - 1.01 కోట్లు
గుంటూరు - 2.20 కోట్లు
కృష్ణ - 1.52 కోట్లు
వెస్ట్ గోదావరి - 1.49 కోట్లు
ఈస్ట్ గోదావరి - 1.94 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.90 కోట్లు
మొత్తం 5 రోజుల ఏపీ షేర్ -21.37 కోట్లు
మరో వైపు.... ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు లేని విధంగా ఈ చిత్రానికి యూఎస్ లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు యూఎస్‌లో ఈ చిత్రం రూ. 6 కోట్ల పైనే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. మరి మున్ముందు ఈచిత్రం ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











