‘సీతమ్మ వాకిట్లో...’కి అక్కడ బిజినెస్ లేకే సొంతంగా
హైదరాబాద్ : మహేష్ బాబు తాజా చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం బిజినెస్ క్రేజ్ రాకపోవటమా...అనేది ఆశ్చర్యపరిచే విషయమే. అయితే తమిళనాట...దిల్ రాజు ఊహించిన మేరకు బిజినెస్ ఆఫర్స్ రాలేదని తెలుస్తోంది. అందులోనూ గతంలోనూ తమళనాట..మహేష్ సినిమాలు పెద్దగా ఆడిన ధాకలాలు లేవు. మొన్న నవంబర్ లో రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ చిత్రం కూడా అక్కడ వర్కవుట్ కాలేదు. దానికి తోడు మొన్నామధ్య ఎంతో క్రేజ్ తో తీసుకున్న ఢమురకం చిత్రం నష్టాలు మిగిల్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి పెద్దగా బిజినెస్ ఆఫర్స్ రాలేదని వినికిడి. దాంతో దిల్ రాజు సొంతంగా తమిళనాట విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా దిల్ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. దిల్ రాజు మాట్లాడుతూ...''నిర్మాతగా నా కెరీర్‌లోనే మరిచిపోలేని సినిమా ఇది. వెంకటేష్, మహేష్ లాంటి టాప్ స్టార్స్‌తో మల్టీస్టారర్ మూవీ చేయడం గొప్ప అనుభూతి. భావోద్వేగాల సమ్మేళనం ఈ సినిమా. కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఒకరి కోసం అందరు, అందరి కోసం ఒకరు.. అనే భావనే వసుధైక కుటుంబంలోని గొప్పదనం. ఆ విషయాన్ని ఓ అందమైన కథగా చెబుతున్నాము''అన్నారు.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ...అన్నదమ్ముల అనుబంధానికి అర్థాలెప్పుడో మారిపోయాయి. అమ్మ ప్రేమ నుంచి... నాన్న సంపాదించిన ఆస్తుల వరకూ వాటాలేసుకొనేవాళ్లే అన్నదమ్ములిప్పుడు. షిప్టుల ప్రకారం అమ్మానాన్నల బాధ్యతల్ని పంచుకొంటున్నారు. ఇందుకు భిన్నమైన... ఆప్యాయతానురాగాలే ఆస్తిపాస్తులనుకొనే సోదరుల కథను తెర మీదకు తీసుకొస్తున్నా అని చెప్పారు.
సమంత, అంజలి, ప్రకాష్‌రాజ్, జయసుధ, రోహిణిహట్టంగడి, రావు రమేష్, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజెమేయర్, కెమెరా: కె.వి.గుహన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాత: దిల్‌రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











