twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SVSC, నాయక్ కలెక్షన్స్......నెం.1 ఎవరు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్ చిత్రాలు రెండు వారాలు పూర్తి చేసుకుని బాక్సాఫీసు వద్ద తమ సత్తా చాటాయి. కలెక్షన్ల విషయంలో పోటాపోటీగా సాగిన ఈచిత్రాలు వరల్డ్ వైడ్ కలెక్షన్ల విషయంలో గా రూ. 50 కోట్ల మార్కును దాటాయి. ఓవరాల్‌గా ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లను బేరీజు వేస్తే నెం.1 స్థానంలో మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం నిలవుగా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-వినాయక్ కాంబో మూవీ 'నాయక్' నెం.2 స్థానంలో నిలిచింది.

    మొదటి వారం బిజినెస్ విషయంలో రూ. 37+ కోట్ల నెట్ కలెక్షన్ తో 'నాయక్' చిత్రం టాప్ లో నలిచింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూ. 35 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. పండగ సీజన్ కావడం, కొత్తగా సినిమాలు ఏమీ రిలీజ్ కాక పోవడంతో సెకండ్ వీకెండ్ వీకెండ్( గత శుక్ర, శని, ఆది.....నాయక్ చిత్రానికి 9, 10, 11వ రోజు....SVSC చిత్రానికి 7, 8, 9 వ రోజు) పూర్తయ్యే సరికి ఈ రెండు చిత్రాలు రూ. 50 కోట్ల మార్కును దాటుతాయని అంతా భావించారు.

    అయితే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పాటు, 'నాయక్' చిత్రం బిజినెస్ రెండో వారం 50% శాతానికి పైగా డౌన్ అయింది. సెకండ్ వీకెండ్ ఈ రెండు చిత్రాలు రూ. 10 కోట్లు, రూ. 8 కోట్లు వసూలు చేసాయి. దీంతో టోటల్ వసూళ్లు కేవలం రూ. 45 కోట్లకు మాత్రమే పరిమితం అయి రూ. 50 కోట్లు సాధించడంలో ఫెయిల్ అయ్యాయి.

    అయితే వీక్ డేస్(గడిచిన సోమ, మంగళ, బుధ, గురు)లో సినిమా బిజినెస్ ఫర్వాలేదనిపించింది. దీంతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం 6 కోట్లు వసూలు చేసింది. టోటల్ గా 14 రోజుల్లో ఈచిత్రం రూ. 51 కోట్ల నెట్ సాధించింది. నాయక్ చిత్రానికి దాదాపుగా రూ. 5.5 కోట్లు వసూలైంది. దీంతో టోటల్ 16 రోజుల్లో నాయక్ చిత్రానికి రూ. 50.5 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది.

    English summary
    
 Hyderabad: Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) and Naayak have once again rocked at the Box Office. Both these Telugu movies, which released during Sankranthi have crossed Rs 50 crore mark at the worldwide collection centres in the second week. The Venkatesh and Mahesh Babu starrer has topped the collection chart at the Box Office, while the Ram Charan Teja starrer landed in the second place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X