Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాయక్, SVSC వీకెండ్, ఆవిషయంలో ఫెయిల్!
హైదరాబాద్: గత వారం విడుదలైన నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతున్నాయి. సంక్రాంతి హాలిడస్ సీజన్ కావడం, ఈ రెండు సినిమాలు తప్ప పెద్ద సినిమాలు ఏమీ బరిలో లేక పోవడం తదితర కారణాలతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి ఫలితాలే వస్తున్నాయి. అయితే తొలి వారంతో పొలిస్తే రెండో వారం బిజినెస్ చాలా వరకు పడిపోయింది.
కలెక్షన్ల పరంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఫస్ట్ ప్లేసులో ఉందని, కొంచెం అటు ఇటుగా 'నాయక్' చిత్రం రెండో స్థానంలో ఉందని ట్రేడ్ టాక్. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే రెండు చిత్రాలు కూడా వరల్డ్ వైడ్గా ఈ వీకెండ్కి రూ. 50 కోట్ల మార్కును దాటడంలో ఫెయిల్ అయ్యాయి.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తొలి వారం రూ. 35 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించింది. అయితే ఈ వారం దాదాపు 50% పైగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. సెకండ్ వీకెండ్ వరకు ఈచిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 10 కోట్లు మాత్రమే వసూలు చేసిందని అంచనా. టోటల్ గా చూసుకుంటే 10 రోజుల్లో దాదాపు రూ. 45 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
'నాయక్' సినిమా విషయానికొస్తే...తొలివారం నాయక్ మూవీ రూ. 37 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించింది. అయితే సెకండ్ వీకెండ్ వరకు బిజినెస్ బాగా డల్ అయి 50% పైగా డ్రాప్ అయింది. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈచిత్రం సెకండ్ వీక్ కలెక్షన్ల విషయంలో సెకండ్ ప్లేస్ లో నిలించింది. రెండో వారంతం వరకు నాయక్ వరల్డ్ వైడ్ గా రూ. 8 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ గా 12 రోజుల్లో రూ. 45 కోట్లకు పైగా వసూలు చేసింది. రాబోయే వీకెండ్ వరకు తెలుగు సినిమా రిలీజ్ లు ఏమీ లేక పోవడంతో ఈ రెండు సినిమాలు రూ. 50 కోట్ల మార్క్ ను అందుకుంటాయనే ఆశతో ఉన్నారు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు.