ఆల్ టైమ్ రికార్డు: ‘సీతమ్మ వాకిట్లో...’ శాటిలైట్ రైట్స్
హైదరాబాద్: ప్యామీలీ ఎంటర్టైన్మెంట్స్ కు టీవీ లో ఉన్న డిమాండే వేరు..ఆ విషయం మహేష్ అతుడు చిత్రం ఎప్పటికప్పుడు ఎన్ని సార్లు వేస్తున్నా శాటిలైట్ రికార్డ్ లు క్రియేట్ చేస్తూ ప్రూవ్ చేస్తూనే ఉంది. తాజాగా మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలై చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం ఘన విజయంతో ముందుకు దూసుకుపోతూండటంతో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కు విపరీతమైన కాంపిటేషన్ ఏర్పడింది. అయితే ఈ కాంపిటేషన్ లో ...జెమినీ టీవి వారు మంచి రేటు పెట్టి ఈ చిత్రం రైట్స్ తీసుకున్నట్లు సమాచారం.
ట్రేడ్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ...ఎనిమిదిన్నర కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. మల్టి స్టారర్ చిత్రం కావటం..మహేష్ కు టీవీలో విపరీతమైన పాపులారిటీ ఉండటం, చిత్రం ఘన విజయం సాధించటం వంటి కారణాలతో ఈ చిత్రానికి ఆ రేటు పలికింది. ఇది తెలుగు సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డు అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం సక్సెస్ గురించి మహేష్ బాబు మాట్లాడుతూ... " సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' సినిమాను ఓ మల్టి స్టారర్ చిత్రంగా చూడొద్దు. ఇది ఒక అద్భుతమైన కుటుంబ కథా చిత్రం. ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ విని కేవలం పది నిమిషాల్లో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ఇది మల్టీ స్టారర్ సినిమా కాదు. ఓ మంచి కుటుంబ కథా సినిమా, సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రేక్షకుల అభిమానం, ఆదరణ చూస్తుంటే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. ఈ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించనివ్వండి''... అన్నారు.
తాను ఈ సినిమా తీయాలని తలంపు వచ్చినప్పుడు కొంచెం భయపడ్డానని వెంకటేష్, మహేష్‌బాబుతో మాట్లాడాక ఆ భయం పూర్తిగా తొలగిపోయిందని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. తాను వారిద్దరితో ఈ సినిమా కోసం మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు మల్టీ స్టారర్‌ల సినిమా కావడంతో ఇద్దరి అభిమానులు ఈ సినిమాని ఆదరిస్తారని ఎలాంటి బెంగ అవసరం లేదని వివరించానని రాజు అన్నారు. తాను ఊహించిన విధంగానే ఈ సినిమాను అందరూ ముఖ్యంగా వెంకటేష్, మహేష్ అభిమానులు బాగా ఆదరిస్తున్నారని, అన్ని సెంటర్‌లలో ఆల్‌టైమ్ రికార్డు వసూళ్ళు వస్తున్నాయని దిల్ రాజు అన్నారు.


Click it and Unblock the Notifications











