Swag 3 days Collections: షాకింగ్‌గా శ్వాగ్ కలెక్షన్లు.. శ్రీ విష్ణు మూవీ లాభాల్లోకి రావాలంటే?

తెలుగు సినిమా రంగంలో కంటెంట్ ఆఫ్ కింగ్‌గా పేరు తెచ్చుకొన్న హీరో, విలక్షణ నటుడు శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం శ్వాగ్. రాజ రాజా చోర దర్శకుడు హసిత్ గోలి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, రీతూ వర్మ, శరణ్య హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 4వ తేదీ రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

శ్వాగ్ సినిమా విషయానికి వస్తే.. మాతృస్వామ్యం, పితృస్వామ్యం కథా నేపథ్యంతో భ్రూణ హత్యలు బ్యాక్ డ్రాప్‌తో కథ సాగుతుంది. మనిషి, మానవత్వం అనే అంశాల ఆధారంగా చక్కటి సందేశంతో రూపొందిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు ఐదు పాత్రలతో ప్రేక్షకులను ఆలరించే ప్రయత్నం చేశారు. మీరా జాస్మిన్, రీతూ వర్మ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

Swag Telugu Movie 3 Days Box Office Collections Worldwide Sri Vishnu Movie Struggling at GBOC

కథను అనుసరించి క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా.. నటీనటుల కూర్పుతో రూపొందించిన ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లతో కలిపి ఈ సినిమాను సుమారుగా 16 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 8 కోట్లుగా వాల్యూ కట్టారు. ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా 1100 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.

శ్వాగ్ మూవీ రిలీజ్‌కు ముందు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 40 లక్షల రూపాయలు నికరంగా, 2.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండో రోజు కూడా నిలకడగా 1.65 కోట్లు నికరంగా 2.1 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 4.6 కోట్ల రూపాయలు రాబట్టింది.

Swag Telugu Movie 3 Days Box Office Collections Worldwide Sri Vishnu Movie Struggling at GBOC

ఓవర్సీస్‌లో శ్వాగ్ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈ సినిమా నార్త్ అమెరికాలో సుమారుగా 1 కోటి రూపాయలు నికరంగా, రెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ సాధించే ప్రయత్నం చేస్తున్నది. ఇదే విధంగా నిలకడగా వసూళ్లను రాబడితే.. ఈ సినిమా లాభాల జోన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక మూడో రోజు ఆదివారం ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే.. సెలవు దినాన్ని పాజిటివ్‌గా మలుచుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా తెలుగులో 1.5 కోట్లు, వరల్డ్ వైడ్‌గా 2.5 కోట్ల గ్రాస్ వసూల్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా సుమారుగా 8 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

More from Filmibeat

Read more about: swag sree vishnu meera jasmine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X