Swathi Muthyam 3 days collections టాక్ చూస్తే సూపర్.. కలెక్షన్లు షాకింగ్‌గా.. మూడు రోజుల్లో ఎంతంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొన్నది. అయితే యునానిమస్‌గా టాక్ సొంతం చేసుకొన్న ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో
కొత్త హీరో, కొత్త దర్శకుడు, సీనియర్ నటీనటుల మేళవింపుతో రూపొందిన స్వాతిముత్యం చిన్న బడ్డెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్లు, ట్రైలర్లు ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమా బజ్ క్రియేట్ చేసింది. దాంతో ఈ చిత్రం బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 3.84 కోట్ల మేర జరిగింది. సుమారు 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.

డిఫరెంట్ పాయింట్.. ఫన్ ఎలిమెంట్స్
వీర్యదానం, పెళ్లి అంశాలతో పక్కా వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన స్వాతిముత్యంలో హాస్యం బాగా పండింది. గోపరాజు రమణ, వీకే నరేష్, రావు రమేష్, హర్షవర్ధన్, సుబ్బరాజు పోషించిన పాత్రలు మంచి హస్యాన్ని పండించాయి. దాంతో పాటు వర్ష, గణేష్ కూడా బాగా ఫెర్ఫార్మ్ చేయడంతో ఏకగ్రీవంగా మంచి టాక్‌ను సంతం చేసుకొన్నది.

పాజిటివ్ టాక్‌తో స్వాతిముత్యం
అయితే సానుకూలమైన టాక్‌ను భారీగా స్వాతిముత్యం సాధించినప్పటికీ.. దానిని కలెక్షన్ల రూపంలో మార్చుకొనేందుకు బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతున్నది. నాగార్జున, చిరంజీవి లాంటి అగ్రహీరోల సినిమాల మధ్య ఒత్తిడికి గురైంది. దాంతో ఆక్యుపెన్సీ శాతం కూడా పెద్దగా నమోదు కాలేదు. అయితే మౌత్ టాక్‌తో రోజు రోజుకు కలెక్షన్లను మెరుగు పరుచుకొనే ప్రయత్నం చేస్తున్నది.

గత మూడు రోజుల్లో స్వాతిముత్యం వసూళ్లు
స్వాతిముత్యం తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 56 లక్షల వసూళ్లను రాబట్టింది. రెండో రోజున 58 లక్షలు, మూడో రోజున 60 లక్షల రూపాయలు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో తొలి రోజు 7 లక్షలు, రెండో రోజు 6 లక్షలు, మూడో రోజు 5.5 లక్షలు సాధించినట్టు తాజా సమాచారం.

స్వాతిముత్యం లాభాల్లోకి రావాలంటే?
స్వాతిముత్యం సినిమా గత మూడు రోజుల్లో 1.5 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసిందనే విషయం ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..ఇంకా 2.5 కోట్లకుపైనే వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఈ వారాంతంలో అంటే శని, ఆదివారాల్లో కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాభాల్లోకి ఈ సినిమా చేరుకొంటుందా లేదా అనే వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











