సైరా వసూళ్ల జోష్.. నైజాంలో మెగా మ్యాజిక్.. బాహుబలి రేంజ్‌లో కలెక్షన్లు

Recommended Video

Sye Raa Into Safe Zone || Sye Raa 13 days Box Office Collections

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా నర్సింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతూనే రికార్డు స్థాయి కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్రం తెలుగు, కన్నడ రాష్ట్రాల్లోనే భారీ కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెలవుల్లో భారీ కలెక్షన్లు సాధిస్తుందనే అంచనాలను తలకిందులయ్యాయి. అయితే తాజాగా సైరా బాక్సాఫీస్ వద్ద పుంజుకొని భారీ కలెక్షన్లు సాధించడం ట్రేడ్ వర్గాలను, డిస్టిబ్యూటర్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. గత 12 రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..

ఓవర్సీస్‌లో వసూళ్లు

ఓవర్సీస్‌లో వసూళ్లు

ఓవర్సీస్‌లో అంచనాలను చేరుకోనప్పటికీ.. వసూళ్ల పరంగా భారీగానే రాబట్టింది. గత 13 రోజుల్లో సుమారు 3000K డాలర్లకు చేరువైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండోవారంలోకి ప్రవేశించిన సైరా గత 10 రోజుల్లో $2337K వసూలు చేయగా, శుక్రవారం $53K, శనివారం $85K సాధించి $2475K నమోదు చేశాయి. ఇక ఆదివారం నాటి కలెక్షన్లలో భారీ పెరుగుదల ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ వసూళ్లతో ఇప్పటికే యూఎస్, కెనడా బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ 8 స్థానంలో నిలిచింది.

నైజాంలో ధమాకా

నైజాంలో ధమాకా

మెగా హీరోలకు నైజాం మార్కెట్ అద్భుత దీపం లాంటింది. అలాంటి ప్రాంతంలో సైరా వసూళ్ల హంగామాను చేసింది. నాన్ బాహుబలి తర్వాత మూడోస్థానంలో సైరా నిలిచింది. గతంలో బాహుబలి చిత్రాలు 30 కోట్ల షేర్‌ను సాధించగా.. ఆ రికార్డు సరసన సైరా నిలిచింది. గత 12 రోజుల్లో సైరా నైజాంలో 30 కోట్ల షేర్‌ను రాబట్టడం విశేషం. ఈ మొత్తాన్ని బాహుబలి2 మూవీ 5 రోజుల్లో రాబట్టగా, సైరా 12 రోజుల్లో, బాహుబలి1 మూవీ 24 రోజుల్లో కలెక్ట్ చేసింది.

నైజాంలో 13 రోజుల కలెక్షన్లు

నైజాంలో 13 రోజుల కలెక్షన్లు

అక్టోబర్ 2 తేదీ గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా చిత్రం నైజాంలో సాధించిన 13 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తొలిరోజు రూ.8.10 కోట్లు, రెండో రోజున 3.98 కోట్లు, మూడో రోజున రూ.2.55 కోట్లు, నాలుగో రోజున రూ.2.57 కోట్లు, ఐదో రోజున రూ.2.48 కోట్లు, ఆరోరోజున రూ.1.96 కోట్లు, ఏడో రోజున రూ.2.28 కోట్లు, ఎనిమిదో రోజున రూ.2.48 కోట్లు, తొమ్మిదో రోజున రూ.1.30 కోట్లు, పదో రోజున రూ.88 లక్షలు, 11వ రోజున రూ.1.12 కోట్లు, 12, 13వ రోజున కోటికిపైగానే వసూళ్లను సాధించాయి.

 బాహుబలి తర్వాత సైరా

బాహుబలి తర్వాత సైరా

సైరా నైజాం ప్రీ రిలీజ్ విషయానికి వస్తే రూ.28 కోట్ల బిజినెస్ చేసింది. గత 13 రోజుల్లో ఈ చిత్రం 30 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా దాదాపు రూ.2 కోట్లకుపైగా లాభాలను రాబట్టింది. ఈ సినిమా నైజాంలో మరింతగా లాభాలను పెంచే అవకాశం లేకపోలేదు. నైజాంలో ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ

తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ

ఇక తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్‌ను సాధించింది. ఇక చిరంజీవి కెరీర్‌లో రెండో 100 కోట్లు సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. అయితే ఈ వసూళ్లు ఇంకా జోరందుకొనే అవకాశం ఉంది. మరో వారం పాటు ఈ సినిమా కలెక్షన్ల జోరు కొనసాగించే అవకాశం లేకపోలేదు.

దక్షిణాదిలో 13వ చిత్రంగా

దక్షిణాదిలో 13వ చిత్రంగా

మొత్తంగా సైరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.175 కోట్ల షేర్‌ను.. రూ.225 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దక్షిణాదిలో 200 కోట్ల వసూళ్లను సాధించిన 13వ చిత్రంగా ఈ సినిమా రికార్డు నెలకొల్పింది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో సైరా ప్రభావం చూపలేకపోవడం ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X