twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా నరసింహా రెడ్డి 14వ రోజు కల్లెక్షన్స్ వివరాలు.. ఊహించిన దానికి మించి!

    |

    Recommended Video

    Sye Raa 14 Days Box Office Report || ట్రేడ్ వర్గాలు ఏం అంటున్నాయి ?

    గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న మొదలెట్టిన 'సైరా నరసింహా రెడ్డి' జైత్రయాత్ర నేటికీ కొనసాగుతూనే ఉంది. దేశ విదేశాల్లో కలెక్షన్ల ప్రవాహం పారిస్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి అభినయం చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఉయ్యాలవాడ వీరుడు 14వ రోజు ప్రయాణాన్ని కూడా ముగించాడు.

    భారీ బడ్జెట్‌ మూవీ.. తెలుగు ప్రేక్షకులే గాక!

    భారీ బడ్జెట్‌ మూవీ.. తెలుగు ప్రేక్షకులే గాక!

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుమారు 270 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ సై.. సైరా అంటోంది. తండ్రికి రామ్ చరణ్ ఇచ్చిన కానుక మెగా అభిమానులతో పాటు యావత్ సినీ లోకాన్ని అలరిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ ఈ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు.

    తెలుగులో ఓకే కానీ.. మిగితా భాషల్లో

    తెలుగులో ఓకే కానీ.. మిగితా భాషల్లో

    ఫ్యాన్ ఇండియా లెవెల్‌లో తెలుగుతో పాటు ఇతర నాలుగు భాషల్లో సైరా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు వర్షన్ లో 100 కోట్ల మైలురాయిని సునాయాసంగా దాటేసిన ఈ సినిమా.. తమిళ, మళయాళ, హిందీ వెర్షన్లలో మాత్రం డిసప్పాయింట్ చేసింది. తెలుగు మినహాయిస్తే మిగితా భాషల్లో ఈ సినిమా కేవలం 35 కోట్ల రూపాయలే రాబట్టిందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

    14వ రోజు కలెక్షన్ రిపోర్ట్

    14వ రోజు కలెక్షన్ రిపోర్ట్

    దసరా సీజన్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా నరసింహా రెడ్డి జోష్ కనిపించింది. ఆర్టీసీ బస్సుల స్ట్రైక్, తెలంగాణలో సెలవుల పొడగింపు కూడా సైరాకు కలిసొచ్చిందని టాక్ నడుస్తోంది. 14వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 84 కోట్ల వసూళ్లు రాబట్టినట్లుగా రిపోర్ట్స్ వచ్చాయి.

    తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత..?

    తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత..?

    రెండు తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజు వసూళ్లు చూస్తే.. నైజాంలో 28 లక్షలు, సీడెడ్‌లో 20 లక్షలు, ఉత్తరాంధ్రలో 16 లక్షలు, ఈస్ట్ గోదావరి 5.3 లక్షలు, వెస్ట్ గోదావరి 4.1 లక్షలు, గుంటూరు 3.3 లక్షలు, కృష్ణా 4.2 లక్షలు, నెల్లూరు 2.9 లక్షలు, మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 84 లక్షల మేర వసూళ్లు రాబట్టింది సైరా నరసింహా రెడ్డి.

    నటులందరూ భేష్ అనిపించుకుంటూ

    నటులందరూ భేష్ అనిపించుకుంటూ

    సైరా నరసింహా రెడ్డి చిత్రంలో మెగాస్టార్ సరసన తమన్నా, నయనతార హీరోయిన్లుగా నటించారు. కిచ్చ సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి నటనలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ విజయం మెగా అభిమానుల్లో జోష్ నింపింది.


    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. On first day first show this movie got possitive talk. So this movie gets huze collections worldwide. This movie day 14 box office report is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X