తెలుగు రాష్ట్రాల్లో సైరా హవా.. అక్కడ మాత్రం దారుణం.. ఇప్పటి వరకు ఎంత రికవరీ చేసిందంటే..?
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం సైరా. తొలి స్వతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడ అయిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా.. తెలుగునాట ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరకీ తెలిసిందే.

సినీ ప్రముఖల ప్రశంసల వెల్లువలు..
సైరాను వీక్షించిన సినీ పెద్దలు ఆకాశానికెత్తేశారు. రాజకీయ ప్రముఖులు కూడా సినిమాను వీక్షించి తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సైరాను వీక్షించి.. చిరంజీవిని, చిత్రయూనిట్‌ను కొనియాడారు. తమిళ, తెలుగు ప్రజల మధ్య ఉన్న సంబంధాన్ని మరోసారి చూపించారంటూ కొనియాడారు.

ప్రత్యేకంగా సన్మానించిన టీఎస్సార్
ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, నిర్మాత.. కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డి.. చిత్రయూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. రామ్ చరణ్ ధైర్యాన్ని కొనియాడారు. తమన్నా పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

ప్రశంసలతో పాటు కలెక్షన్లు..
ఈ సినిమాకు కేవలం ప్రశంసలే కాదు.. కాసుల వర్షం కూడా కురుస్తోంది. మొదటి రోజు 85కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి టాలీవుడ్ సత్తా చాటింది. రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసి ఔరా అనిపించింది. తొమ్మిదో రోజుకూడా సైరా కలెక్షన్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
Recommended Video

తొమ్మిదో రోజూ దూసుకుపోయింది..
ఇప్పటికే దాదాపు 195కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన సైరా.. తొమ్మిదో రోజుతో రెండు వందల కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తొమ్మదో రోజు సైరా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5కోట్లను వసూళ్లు చేసినట్లు సమాచారం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు దాదాపు 72శాతం రికవరీ చేసినట్టు తెలుస్తోంది. మిగతా ఏరియాల్లో (కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్, హిందీ) మాత్రం నష్టం తప్పేలా లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











