సైరా బాక్సాఫీస్ ప్రభంజనం.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి మెగా మూవీ
సైరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద అలజడి సృష్టిస్తున్నది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ చిత్రం రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజైంది. తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది, ఉత్తరాది, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల భారీ కలెక్షన్లు రాబడుతున్నది. తొలిరోజు ఎంత మేరకు వసూళ్లు రాబట్టిందంటే..

నైజాం, సీడెడ్‌లో
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ప్రభంజనం సాగింది. ముఖ్యంగా నైజాంలో భారీ వసూళ్లను రాబట్టింది. నైజాంలో రూ.8.1 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసింది. సీడెడ్‌లో రూ.5.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.4.72 కోట్లు వసూలు చేసింది. ఈ ఏరియాలో సింగిల్ డే రికార్డులను నెలకొల్పడం గమనార్హం.

ఆంధ్రాల్లో
ఇక ఆంధ్రాలో తూర్పు గోదావరి జిల్లాలో రూ.5.43 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.4.5 కోట్లు, గుంటూరులో రూ.5.06 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.3.03 కోట్లు, నెల్లూరులో రూ.2.09 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.38.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

దక్షిణాది రాష్ట్రాల్లో
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వసూళ్ల సునామీ కొనసాగింది. తొలిరోజు కర్ణాటకలో రూ.6.40 కోట్లు, తమిళంలో రూ.60 లక్షలు, కేరళలో రూ.32 లక్షలు వసూలు చేసింది. ఇక హిందీలో రూ.1.4 కోట్లు రాబట్టింది. వారాంతంలో ఈ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

ఓవర్సీస్‌లో
ఇక అమెరికా, కెనడాలో కూడా భారీ కలెక్షన్లు బాక్సాఫీస్‌ను కుదిపేసాయి. ఈ రెండు ప్రదేశాల్లో రూ.4.25 కోట్లు వసూలు చేసింది. మిగితా దేశాల్లో రూ.2 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 53.72 కోట్ల నెట్, రూ.85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజుకు రూ.100 కోట్ల రికార్డును సునాయసంగా అధిగమించే అవకాశం కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











