ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్న సైరా.. తొలిరోజే రికార్డుల పరంపర
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. విడుదలైన ప్రతీ చోట భారీ వసూళ్లను రాబడుతున్నట్టు సమాచారం. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి మొదలైన ప్రివ్యూలకు మంచి స్పందన కనిపిస్తున్నది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో స్పెషల్ షోలు ప్రదర్శించగా బ్రహ్మండమైన రెస్సాన్ లభించిందనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తొలి రోజు అంచనా కలెక్షన్లు ఎంత ఉండొచ్చంటే..

యూఎస్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్లు
అమెరికా బాక్సాఫీస్ వద్ద సైరా సినిమా సందడి భారీగా ఉంది. మంగళవారం ప్రివ్యూలకు అభిమానులు పోటెత్తారు. ఇక్కడ చూసినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ బోర్డు కనిపించాయి. దీంతో మంచి ఒపెనింగ్స్ రావడానికి ఆస్కారం కలిగింది. యూఎస్ వ్యాప్తంగా అన్ని చోట్ల థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి.

మిలియన్ డాలర్ చేరువగా
మంగళవారం రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం సైరా ఒక మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరేందుకు దగ్గరైంది. ఈ చిత్రం 269 లొకేషన్లలో 809,136 డాలర్లకుపైగా రాబట్టింది. కెనడాలో 40 వేల డాలర్లు వసూలు చేసినట్టు సమాచారం. మొత్తంగా 305 లొకేషన్లలో 849,000 డాలర్లు వసూలు చేసింది. అయితే ఈ చిత్రం అధికారికంగా మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లో చూసుకొంటే సైరా చిత్రం రికార్డు లెవెల్ కలెక్షన్లు రాబట్టే అవకాశం కనిపిస్తున్నది. నైజాంలో రూ.15 కోట్లు, సీడెడ్‌లో రూ.12 కోట్లు, గుంటూరులో రూ.9 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.11 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.13 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.12 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.7 కోట్లు, నెల్లూరులో రూ.5 కోట్ల వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Recommended Video

ప్రపంచవ్యాప్తంగా
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకొంటే తెలుగు రాష్ట్రాల్లో రూ.85 కోట్లు, దక్షిణాదిలో రూ.32 కోట్లు, ఉత్తరాదిలో రూ.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.28 కోట్ల మేర వసూలు రాబడుతుందని అంచానా వేస్తున్నారు. ఓవరాల్‌గా రూ.180 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. బాహుబలి2 వసూలు చేసిన రూ.42.90 కోట్ల కలెక్షన్లను దాటుతుందా అనే విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











