బాహుబలి, సాహో రికార్డును తుడిచేసిన సైరా.. మెగా ఫ్యాన్స్ రచ్చ రచ్చ

దేశ సినీ పరిశ్రమ దృష్టంతా తెలుగు సినీ పరిశ్రమపై పడింది. అందుకు కారణం ఒకటి సాహో కాగా, రెండోది సైరా నర్సింహారెడ్డి చిత్రం. ఈ రెండు చిత్రాల టీజర్, ట్రైలర్ వేడుకలు ముంబై వేదికగా జరగడంతో నేషనల్ మీడియా దృష్టంతా టాలీవుడ్‌పై పడింది. ఇక ఇదే కాకుండా సాహో, సైరాలపై తెలుగు రాష్ట్రాల్లో ఫీవర్ మొదలైంది. బిజినెస్ పరంగా, రిలీజ్ పరంగా భారీ ప్రయత్నాలకు కారణమవుతున్నది. ఇలా ఈ రెండు సినిమాలు సెన్సేషనల్‌గా మారిన సమయంలో ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

దేశవ్యాప్తంగా ఫ్యాన్సీ బిజినెస్

దేశవ్యాప్తంగా ఫ్యాన్సీ బిజినెస్

టీజర్ల రిలీజ్ తర్వాత సాహోను అధిగమించలేకపోయిన సైరా.. మరో విషయంలో ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. సైరా ప్రీ రిలీజ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఫ్యాన్సీ బిజినెస్ జరుగుతున్నది. ఇలాంటి సమయంలో గోదావరి జిల్లాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు బిజినెస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

 గోదావరి జిల్లాలో బిజినెస్

గోదావరి జిల్లాలో బిజినెస్

గోదావరి జిల్లాలో సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. బాహుబలి బిజినెస్‌కు మంచి జరగడం ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బాహుబలి థియేట్రికల్ హక్కులు రూ.18 కోట్ల కాగా, సాహో 19.5 కోట్ల బిజినెస్‌తో క్లోజ్ చేసింది. సాహో థియేట్రికల్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

సైరా హక్కులు రికార్డు

సైరా హక్కులు రికార్డు

ఓ పక్క సాహో బిజినెస్ టాక్ ఇండస్ట్రీగా మారిన క్రమంలో సైరా బిజినెస్ సంచలనం రేపింది. సైరా బిజినెస్ రూ.19.6 కోట్లు కావడం సెన్సేషన్‌గా మారింది. ఇలా పోటాపోటీగా బిజినెస్ జరగడంతో అభిమానుల్లో సంతోషం వ్యక్తమైంది. ఇప్పటి వరకు గోదావరి జిల్లాల హక్కుల విషయంలో ఇదే టాప్ రికార్డుగా మారింది.

 వసూళ్లపై ట్రేడ్ వర్గాల గుబులు

వసూళ్లపై ట్రేడ్ వర్గాల గుబులు

అయితే ఇలా పోటాపోటీగా సైరా, సాహో థియేట్రికల్ బిజినెస్ జరగడంతో ట్రేడ్ వర్గాల్లో ఓ వాదన మొదలైంది. ఈ బిజినెస్ విషయంలో బ్రేక్ ఈవెన్ రావాలంటే కనీసం ఈ రెండు చిత్రాలు తక్కువలో తక్కువ 30 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు పేర్కొంటున్నారు. ఒకవేళ సాహో, సైరా రికార్డులు తిరగరాస్తే ఈ మార్కును అందుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చేనే మాట బలంగా వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X