సైరా క్లోజింగ్ కలెక్షన్లు.. ఎంత మేరకు నష్టం వాటిల్లిందంటే..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అద్భుతంగా తెరకెక్కిన సైరా నర్సింహారెడ్డి చిత్రం ఆర్థిక అంచనాలను అందుకోలేకోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున విడుదలైన ఈ చిత్రం ఆరంభంలో భారీ వసూళ్లు నమోదు చేసినా.. చివరకు ఆ ఊపును కొనసాగించలేకపోయింది. దాదాపు 31 రోజుల తర్వాత సైరా డిస్టిబ్యూటర్లకు ఎలాంటి ఫలితాన్ని అందించిందంటే..

ఏపీ, తెలంగాణలో
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కలెక్షన్లను పరిశీలిస్తే..
నైజాంలో రూ.27.6 కోట్లు షేర్
సీడెడ్‌లో రూ.17.9 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ.13.06 కోట్లు,
తూర్పు గోదావరి జిల్లాలో రూ.8.3 కోట్లు,
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ6.45 కోట్లు.
గుంటూరులో రూ.9.57 కోట్లు,
కృష్ణ జిల్లాలో రూ.7.58 కోట్లు,
నెల్లూరులో రూ.4.1 కోట్ల షేర్ వసూలు చేసింది.
దాంతో మొత్తంగా 94.56 కోట్ల షేర్, రూ.143 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో
తెలుగేతర రాష్ట్రాల బాక్సాఫీస్ పరిస్థితి చూస్తే.. కర్ణాటకలో రూ.16.7 కోట్లు షేర్, 30.4 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కలిపితే.. రూ.5.1 కోట్లు షేర్ సాధించగా.. రూ.6.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఉత్తర భారత దేశంలో రూ.5.1 కోట్ల షేర్, రూ.12.8 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది.

ఓవర్సీస్ కలెక్షన్లు
ఇక ఓవర్సీస్ కలెక్షన్లను పరిశీలిస్తే.. ఉత్తర అమెరికా (యూఎస్, కెనడా) దేశాల్లో ఈ చిత్రం రూ.9.28 కోట్లు షేర్, రూ.18.56 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. గల్ఫ్‌లో రూ.1.66 కోట్ల షేర్, రూ.4.15 కోట్ల గ్రాస్ వసూళ్లను, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో రూ.95 లక్షలు షేర్ (2.1 కోట్ల గ్రాస్), యూకే, మలేషియాలో రూ.36 లక్షలు (90 లక్షల గ్రాస్) వసూలు చేసింది. మిగితా దేశాల్లోని వసూళ్లను కలుపుకొంటే.. రూ.132.85 కోట్ల షేర్ (3 కోట్ల గ్రాస్) నమోదు చేసింది.

ఎంత నష్టమంటే..
ఇక సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం, ఏపీలో రూ.107.4 కోట్లు, కర్ణాటకలో రూ.27 కోట్లు, తమిళనాడులో రూ.7.6 కోట్లు, కేరళలో రూ.2.5 కోట్లు, మిగితా దేశాల్లో రూ.27.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.20 కోట్ల మేర బిజినెస్ చేసింది. అన్ని ఏరియాల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.152.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ నమోదైంది. చివరకు రూ.133 కోట్ల మేర రాబట్టడంతో సుమారు 23 కోట్ల మేర నష్టాలతో ముగిసింది.


Click it and Unblock the Notifications











