twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా 18 రోజుల కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద హిట్టా? ఫట్టా?

    |

    Recommended Video

    Sye Raa Worldwide Box Office Collections Day 19 || బాక్సాఫీస్ వద్ద హిట్టా? ఫట్టా?

    సైరా నర్సింహరెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడో వారాంతంలో మెరుగైన కలెక్షన్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో దారుణమైన వసూళ్లు నమోదు చేసినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల హవాను కొనసాగిస్తున్నది. మూడో శని, ఆదివారాల్లో ఏ మేరకు వసూళ్లు సాధించిందంటే..

    19వ రోజు ఆశాజనకంగా

    19వ రోజు ఆశాజనకంగా

    సైరా చిత్రానికి వారాంతంలో మంచి స్పందన కనిపించింది. 18, 19వ రోజు మెరుగైన వసూళ్లను ఏపీ, నైజాంలో వసూలు చేసింది. దాదాపు 35 శాతం పెరుగుదలతో అన్ని చోట్ల 75 శాతానికిపైగా ఆక్యుపెన్సీ కనిపించిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. 19వ రోజు (ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లో రూ.50 లక్షలకుపైగానే వసూళ్లు రాబట్టినట్టు సమాచారం.

     18వ రోజు వసూళ్లు

    18వ రోజు వసూళ్లు

    ఇక 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.12 లక్షలు, సీడెడ్‌లో 7.5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.12 లక్షల రూపాయాలు వసూలు చేయగా.. పశ్చిమ, తూర్పు గోదావరిలో కలిప 5 లక్షలు, గుంటూరులో రూ.2.5 లక్షలు, కృష్ణాలో రూ.2.7 లక్షలు, నెల్లూరులో రూ.1.6 లక్షలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా

    తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా

    ఇక సైరా 18 రోజులు మొత్తం కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.32 కోట్లకుపైగా, సీడెడ్‌లో రూ.18.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.16.25 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.9.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.06 కోట్లు వసూలు చేసింది. గుంటూరులో మొత్తంగా రూ.9.52 కోట్లు, కృష్ణాలో రూ.7.39 కోట్లు, నెల్లూరులో రూ.4.28 కోట్లు కలెక్ట్ చేసి మొత్తంగా రూ.104 కోట్ల షేర్ నమోదు చేసింది.

    ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో

    ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో

    మిగితా రాష్ట్రాల్లతో పోల్చుకొంటే కర్ణాటకలో సైరా మెరుగైన వసూళ్లను రాబట్టింది. గత 18 రోజుల్లో కర్ణాటకలో సైరా రూ.14 కోట్ల మేరకు రాబట్టగా, తమిళనాడులో రూ.1.36 కోట్లు, కేరళలో రూ.73 లక్షలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో రూ.5.41 కోట్లు, అమెరికా, కెనడాలో రూ.10 కోట్లు, ఇతర దేశాల్లో రూ.4 కోట్ల మేర వసూలు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్ల షేర్, రూ.229 కోట్ల గ్రాస్‌తో ముందుకెళ్తున్నది. ఇంకా ఈ చిత్రం రూ.45 కోట్లకుపైగా వసూలు చేస్తే లాభాల్లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తున్నది.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. On first day first show this movie got positive talk. So this movie gets huge collections worldwide. After 17th day, This movie got 140 crores share worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X