సైరా 24 రోజుల కలెక్షన్లు.. ఎంత నష్టం వచ్చిందంటే.. చిరంజీవి కెరీర్‌లోనే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను సాధించింది. తొలుత భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత ఆ ఊపును కొనసాగించలేకపోయింది. అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అభిమానులను సంతృప్తి పరిచినా.. సగటు ప్రేక్షకుడిని దేశవ్యాప్తంగా మెప్పించలేకపోయింది. హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చూపించలేకపోయింది. గత 24 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే.

తెలుగు రాష్ట్రాల్లో
తమిళ డబ్బింగ్ చిత్రాలు బిగిల్, ఖైదీ సినిమాలు రిలీజైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సైరా 24 నాల్గవ రోజు సాధారణమైన వసూళ్లను సాధించింది. దాంతో గత 24 రోజుల వసూళ్లు రూ.106 కోట్ల వద్ద నమోదు అయింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.105 కోట్ల మేర బిజినెస్ కాగా.. ఆ మేరకు బ్రేక్ ఈవెన్ సాధించింది.
Recommended Video

కర్ణాటకలో వసూళ్లు
కర్ణాటకలో భారీ కలెక్షన్లు సాధించ వచ్చనే ఆశలకు సైరా గండికొట్టింది. ఈ సినిమా బిజినెస్ కర్ణాటకలో రూ.26.25 కోట్ల మేర జరిగింది. అయితే గత 24 రోజుల్లో కేవలం రూ.14.25 కోట్లు మాత్రమే వసూళు చేసింది. అంటే దాదాపు రూ.12 కోట్లకుపైగా నష్టాన్ని నమోదు చేసింది. ఇది ట్రేడ్ వర్గాలకు ఊహించిన ఫలితంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా
ఇక ప్రపంచవ్యాప్తంగా 187.25 కోట్ల బిజినెస్ జరిగితే.. గత 24 రోజుల్లో అన్ని చోట్లలో వసూళైన కలెక్షన్లు 141.16 కోట్లుగా నమోదైంది. అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.188 కోట్లు రావాల్సి ఉండగా.. దాదాపు రూ.47 కోట్ల మేర నష్టం ఇంకా పూడ్చుకోవాల్సి ఉంది. గ్రాస్ లెక్కల్ని పరిశీలిస్తే.. రూ.232.11 కోట్లు రాబట్టింది.

ప్రీరిలీజ్ బిజినెస్.. ఎంత వసూలంటే..
ఇక సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో 28 కోట్ల బిజినెస్ జరుగగా రూ.32.36 కోట్లు వసూలు చేసి లాభాల్ని పంచిపెట్టింది. ఏపీలో 58 ఎనిమిది కోట్లకుగాను.. రూ.54 కోట్లు, సీడెడ్‌లో 20 కోట్లకుగాను రూ.18.97 కోట్లు, తమిళనాడులో 8 కోట్లకుగాను రూ.1.36 కోట్లు, కర్ణాటకలో రూ.26.25 కోట్లకుగాను రూ.14 కోట్లు, హిందీలో రూ.26. కోట్లకుగాను రూ.5.42 కోట్లు, కేరళలో రూ.1.7 కోట్లకు గాను రూ.73 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.18 కోట్లకుగాను రూ.13.35 కోట్లు వసూలు చేశాయి.


Click it and Unblock the Notifications











