సైరా ప్రభంజనం.. నాలుగో రోజు వసూళ్లు.. ఆ దూకుడు చూస్తుంటే..!
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి దూకుడుగా కలెక్షన్స్ రాబడుతోంది. అక్టోబర్ 2 వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. రోజు రోజుకూ సైరా కలెక్షన్ల ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సైరా దూకుడు మామూలుగా లేదు.

మూడో రోజుతో పోల్చుకుంటే నాలుగో రోజు
దసరా సెలవులు కావడం సైరాకు బాగా కలిసొస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా మూడో రోజు థియేటర్ల వద్ద కాసుల పంట పండించింది. ఇక నాలుగో రోజైన శనివారం కూడా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల థియేటర్లన్నీ మెగా అభిమానులతో కిటకిటలాడాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి
నాలుగో రోజు ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 61.42 కోట్ల షేర్ రాబట్టింది సైరా నరసింహా రెడ్డి. అన్ని ఏరియాల్లో కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ చిరంజీవి స్టామినా నిరూపించింది. ఉయ్యాలవాడ వీరుడిగా చిరంజీవి నటన చూసి ఫిదా అవుతోంది తెలుగు ప్రేక్షక లోకం.

ఏరియా వైస్ రిపోర్ట్ చూస్తే..
నైజాంలో 17.26 కోట్లు, సీడెడ్ లో 10.38 కోట్లు, నెల్లూరులో 2.89 కోట్లు, కృష్ణాలో 4.68 కోట్లు, గుంటూరులో 6.65 కోట్లు, వెస్ట్ గోదావరిలో 4.87 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 6.44 కోట్లు, ఉత్తరాంధ్రలో 8.69 కోట్లు, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 61.42 కోట్ల షేర్ రాబట్టి హవా కొనసాగిస్తోంది సైరా నరసింహా రెడ్డి.

వీకెండ్, దసరా సెలవులు కావడంతో
వీకెండ్, దసరా సెలవులు సైరాకు బాగా కలిసొచ్చే అంశాలు. ఈ సెలవుల నేపథ్యంలో సైరా పెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టనున్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వీకెండ్, దసరా ముగిసే సరికి ఈ మూవీ మొత్తం రాబట్టేస్తుందని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు సైరా ఇంకెంత ప్రతాపం చూపెడుతుందో!.

సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.


Click it and Unblock the Notifications











