సైరా 7వ రోజు కలెక్షన్లు.. అక్కడ దారుణంగా.. తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు పరిస్థితి ఏమిటంటే..
తెలుగు రాష్ట్రాల్లో సైరా భారీ వసూళ్లు సాధిస్తున్నది. గత రెండు రోజులుగా నమ్మదించిన కలెక్షన్లు దసరా రోజున పుంచుకొన్నాయి. కాగా ఈ చిత్రం నైజాం, ఆంధ్రాలో రికార్డు నికర వసూళ్లు సాధించడం విశేషం. అయితే బుధవారం నుంచి ఈ చిత్ర కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వారాంతం సినిమా కలెక్షన్లు ఊపందుకొంటే లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. గత ఏడు రోజుల్లో ఏ మేరకు వసూళ్లు సాధించిందంటే..

టికెట్ల రేట్లు తగ్గింపు
సైరాకు కొంత ఊరట కలిగించే అవకాశం కనిపిస్తున్నది. బుధవారం నుంచి ఏపీ, తెలంగాణలో టికెట్ల రేట్లు తగ్గించే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి వరకు రూ.250 టికెట్ వసూలు చేస్తుండటం తెలిసిందే. అయితే వారం తర్వాత ఈ రేట్లు సాధారణ స్థితికి వచ్చే పరిస్థితి నెలకొన్నది. ఒకవేళ టికెట్లు రేట్లు తగ్గితే సాధారణ ప్రజలు థియేటర్లకు వెళ్లే వెసులుబాటు కనిపిస్తున్నది.
Recommended Video

ఇతర భాషల్లో దారుణంగా
ఇక ఇతర భాషల్లో సైరా పరిస్థితి దారుణంగా ఉంది. తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి. పలు రాష్ట్రాల్లో సైరా సినిమాను చాలా థియేటర్ల నుంచి తొలగించినట్టు తెలుస్తున్నది. ఇక తెలుగు, ఓవర్సీస్‌లో తప్పితే మిగితా చోట్ల సైరాకు చేదు అనుభవమే మిగిలిందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు
ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ఏడో రోజున 15 శాతం వరకు వసూళ్లు సాధించినట్టు వెల్లడైంది. దీంతో వసూళ్లు భారీగా మెరుగుపడినట్టు తెలుస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే సైరా చిత్రం రూ.6.5 కోట్ల నుంచి రూ.7 కోట్లు సాధించే అవకాశం కనిపిస్తున్నది. దసరా పండుగ సెలవు కావడంతో కలెక్షన్లు పుంజుకొన్నట్టు తెలుస్తున్నది.

మొత్తం కలెక్షన్లు
గత ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఓ మాదిరి వసూళ్లు సాధిస్తున్నది. తెలుగు, ఓవర్సీస్, ఇతర ప్రాంతాల వసూళ్లు మొత్తంగా రూ.9 కోట్లు ఉండవచ్చనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం సైరా చిత్రం రూ.112 కోట్ల నికర వసూళ్లను, రూ.185 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సైరా సాధించినట్టు తెలుస్తున్నది.

లాభం రావాలంటే..
సైరా థియేట్రికల్ బిజినెస్ చూస్తే.. దాదాపు రూ.187 కోట్ల మేరకు జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా కనీసం 70 కోట్ల మేర రాబట్టాల్సింది. ఈ మొత్తం కేవలం తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ నుంచి రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో సైరా ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











