సైరా కలెక్షన్ల సునామీ.. ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లోనే.. సరికొత్త రికార్డ్
ప్రపంచ వ్యాప్తంగా సైరా నరసింహా రెడ్డి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అక్టోబర్ 2 వ తేదీన విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' తర్వాత వచ్చిన 'సైరా నరసింహా రెడ్డి' చిరంజీవి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సైరా కలెక్షన్ల ప్రవాహం నేటికీ ఆగడం లేదు.

చిరంజీవి స్టామినా ఏంటో నిరూపిస్తూ..
తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న సైరా నరసింహా రెడ్డి మూవీ.. కేవలం 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటేసిన సంగతి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కి గాంధీ జయంతి కానుకగా విడుదలైన సైరా నరసింహా రెడ్డి చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. తొలి రోజు నుంచే జోష్‌లో ఉన్న సైరా అదే జోష్ కంటిన్యూ చేస్తుండటం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లోనే
హాలీడే సీజన్ లో వచ్చిన సైరా నరసింహా రెడ్డి కలెక్షన్స్ పరంగా యమ స్పీడ్‌గా దూసుకెళ్తోంది. విడుదలైన 8 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది సైరా నరసింహా రెడ్డి. అత్యంత వేగంగా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన నాలుగో చిత్రంగా నిలిచింది.

ప్రభాస్ బాహుబలి సిరీస్, సాహో తర్వాత..
గతంలో బాహుబలి 2, బాహుబలి, సాహో, రంగస్థలం సినిమాల తర్వాత అత్యంత వేగంగా 200 కోట్ల గ్రాస్ రాబట్టిన చిత్రంగా సైరా నరసింహా రెడ్డి తన పేరును లిఖించుకుంది. సైరా నమోదు చేస్తున్న ఈ రికార్డుల పరంపరపై చిత్రయూనిట్ సహా ట్రేడ్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Recommended Video

8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు వసూళ్లు చూస్తే.. నైజాంలో 2.48 కోట్లు, సీడెడ్‌లో 1.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.10 కోట్లు, ఈస్ట్ గోదావరి 27 లక్షలు, వెస్ట్ గోదావరి 14 లక్షలు, గుంటూరు 35 లక్షలు, కృష్ణా 27 లక్షలు, నెల్లూరు 14 లక్షలు, మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల 91 లక్షల మేర వసూళ్లు రాబట్టింది సైరా నరసింహా రెడ్డి.

తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది సైరా నరసింహా రెడ్డి మూవీ. చిత్రంలో మెగాస్టార్ సరసన తమన్నా, నయనతార హీరోయిన్లుగా నటించారు. కిచ్చ సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి నటనలకు మంచి రెస్పాన్స్ దక్కింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లోనూ సైరాకు మంచి ఆదరణ లభించింది.


Click it and Unblock the Notifications











