14 రోజుల సైరా.. పరిస్థితి ఎలా ఉందంటే? ఇకనైనా..!

Recommended Video

Sye Raa 14 Days Box Office Report || ట్రేడ్ వర్గాలు ఏం అంటున్నాయి ?

మెగాస్టార్ కెరీర్ లోనే మొదటి సారి చారిత్రక నేపథ్యంలో సినిమా వచ్చింది. అదే సైరా నరసింహా రెడ్డి. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ వారిపై చేసిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఇందుకోసమై ఎక్కడా వెనక్కి తగ్గకుండా భారీ బడ్జెట్ కేటాయించారు నిర్మాత రామ్ చరణ్. ఈ సినిమా విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా చూస్తే కాస్త వీక్ అయింది.

మెగాస్టార్‌కి కానుక.. గాంధీ జయంతి రోజు

మెగాస్టార్‌కి కానుక.. గాంధీ జయంతి రోజు

తండ్రి మెగాస్టార్ చిరంజీవికి కానుకగా ఇవ్వాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించారు రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి షో పూర్తి కాగానే మెగా అభిమానుల ఆనందానికి హద్దుల్లేని టాక్ తెచ్చుకుంది సైరా.

14 రోజుల సైరా..

14 రోజుల సైరా..

అక్టోబర్ 2 వ తేదీన విడుదలైన సైరా నిన్నటితో 14 రోజుల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. ఈ 14 రోజుల్లో దేశ, విదేశాల్లో సైరా హంగామా బాగానే నడిచింది. దీంతో ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 225 కోట్ల గ్రాస్, 135 కోట్ల మేర షేర్ రాబట్టింది సైరా నరసింహా రెడ్డి మూవీ.

ఒక్క తెలుగు వర్షన్ లోనే..

ఒక్క తెలుగు వర్షన్ లోనే..

తెలుగు సహా ఐదు భాషల్లో విడుదలైన సైరా.. ఒక్క తెలుగు వర్షన్ లో మాత్రం జోరు కొనసాగించింది. దాదాపు 12 రోజుల పాటు జోరుగా వసూళ్ల ప్రవాహం పారించిన సైరాపై వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ పడింది. 13 వ రోజైన సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి కేవలం ఒక కోటి 9 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది సైరా.

13వ రోజుతో పోల్చితే 30%

13వ రోజుతో పోల్చితే 30%

అదే బాటలో 14వ రోజు మరో అడుగు కిందకేశారు సైరా నరసింహా రెడ్డి. 14వ రోజైన మంగళవారం కూడా మరో వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ పరంగా ఈ సినిమా మరింత స్లో అయింది. 13వ రోజు కలెక్షన్స్‌తో పోల్చితే 30% మేర సైరా కలెక్షన్స్ డ్రాప్స్ అయ్యాయి. ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్ కూడా యావరేజ్ కావడంతో కేవలం 70 లక్షల మేర వసూళ్లు వచ్చాయని తెలిసింది.

రెండు వారాలు పూర్తి.. టికెట్ రేట్స్ డౌన్

రెండు వారాలు పూర్తి.. టికెట్ రేట్స్ డౌన్

ఈ లెక్కన ఓవరాల్‌గా చూస్తే సైరా.. ఆశించిన మేర కలెక్షన్స్ రాబట్టలేదనే చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తయింది కాబట్టి దాదాపు అన్ని చోట్లా టికెట్ రేట్లు నార్మల్ రేటుకి రానున్నాయి. సో ఇకనైనా సైరా కలెక్షన్స్ పుంజుకుంటాయేమో చూడాలి మరి. టికెట్ రేట్స్ డౌన్ కావడం కారణంగా సైరా జోష్ పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X