సైరా కలెక్షన్ల సునామీ.. మొదటి రోజే కుమ్మేసిన ఉయ్యాలవాడ వీరుడు

Recommended Video

Sye Raa Narasimhaa Reddy 1st Day Collections Report || 50 కోట్ల క్లబ్‌లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. దీంతో తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఆ వివరాలు చూస్తే..

ఇటు దేశంలో.. అటు ఓవర్సీస్‌‌లో తొలిరోజే

ఇటు దేశంలో.. అటు ఓవర్సీస్‌‌లో తొలిరోజే

మెగా మూవీ సైరా నరసింహా రెడ్డి తొలి రోజే దేశవ్యాప్తంగా 50 కోట్ల షేర్‌ దాటేసిందని ఫిల్మ్‌ ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఓవర్సీస్‌ మార్కెట్‌లో చూస్తే తొలిరోజు దాదాపు 10 కోట్ల షేర్ వచ్చిందని తెలుస్తోంది. ఓవర్సీస్‌ మార్కెట్‌ పరంగా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల బాక్సాఫీసులను ఉయ్యాలవాడ వీరుడు కుమ్మేసినట్లు సమాచారం.

ప్రీమియర్ షోస్ ద్వారానే అమెరికా మార్కెట్‌లో

ప్రీమియర్ షోస్ ద్వారానే అమెరికా మార్కెట్‌లో

అమెరికా మార్కెట్‌లో మంగళవారం రోజు ప్రీమియర్ షోస్ ద్వారా 8,17,0000 డాలర్ల వసూళ్లు రాబట్టిన సైరా.. కెనడాలో మరో 40,122 డాలర్స్ రాబట్టింది. ఇలా మొత్తంగా ప్రీమియర్ షోస్ ద్వారానే 8,57,000 డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది సైరా నరసింహా రెడ్డి. బుధవారం సాయంత్రం వరకు మరో 1,45,000 డాలర్ల గ్రాస్ వచ్చిందని తెలిసింది.

అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ డాలర్స్

దీంతో అమెరికాలో 1 మిలియన్ డాలర్ల వసూళ్లను అతి తక్కువ సమయంలోనే సాధించింది 'సైరా నరసింహా రెడ్డి'. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది చిత్రయూనిట్. సినిమాకు వచ్చిన హిట్ టాక్ నేపథ్యంలో రాబోయే సెలవు దినాల్లో సైరా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నాయని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

సైరా జోష్ చూస్తుంటే..

సైరా జోష్ చూస్తుంటే..

దేశ విదేశాల్లో సైరా జోష్ చూస్తుంటే అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 కోట్ల భారీ ప్రీ బిజినెస్ చేసిన సైరా.. మరో ఒకటి రెండు రోజుల్లోనే లాభాల బాటలోకి వచ్చేసి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

'సైరా నరసింహా రెడ్డి' విశేషాలు

'సైరా నరసింహా రెడ్డి' విశేషాలు

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానుల సంబరాలు మిన్నంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X