‘సాహసం’ ఆడియో రైట్స్ ఎంతకమ్మారంటే...
హైదరాబాద్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'సాహసం'. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ ని టి సీరిస్ వారు సొంతం చేసుకున్నారు. ఇరవై లక్షల రూపాయలకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు శ్రీ కి రీ లాంచ్ చిత్రం కావటం, హీరో ఫెయిల్యూర్స్ లో ఉన్నా ఈ రేటు రావటం జరగింది.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ..''చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.
నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ''గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటిలతో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. చందు తయారు చేసిన స్క్రిప్ట్ గోపీచంద్‌కు చాలా బాగుంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.


Click it and Unblock the Notifications












