twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dobaaraa: తాప్సి సినిమాకు దారుణమైన రెస్పాన్స్.. మొదటి రోజే షోలు క్యాన్సిల్.. కలెక్షన్స్ ఎంత రావచ్చంటే?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి గుర్తింపు ఉన్న అందుకున్న తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. మొన్నటి వరకు గ్లామరస్ పాత్రలో కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం కంటెంట్ ఉన్న డిఫరెంట్ కథలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక రీసెంట్ గా తాప్సి నుంచి వచ్చిన ఒక సినిమాకు ఊహించిన విధంగా దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో జనాలు లేక మొదటి రోజే చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక ఎంత దారుణంగా ఆక్యుపెన్సీ వచ్చింది.. అనే వివరాల్లోకి వెళితే..

    తాప్సి న్యూ మూవీ

    తాప్సి న్యూ మూవీ

    బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో విభిన్నమైన కథలను ఎక్కువగా తెరపైకి తీసుకువస్తున్న నటీమణులలో తాప్సి పన్ను ఒకరు. కానీ ఎంతో నమ్మకం పెట్టుకున్న దోబరా సినిమా ఊహించిన విధంగా మొదటి రోజే ఫ్లాట్ టాక్ ను అందుకుంది. అసలు ఈ సినిమా విడుదల అవుతున్నట్లు జనాలకు తెలుసా తెలియదా అనే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చాలా వరకు సినిమా హాల్స్ ఖాళీగానే దర్శనమిచ్చాయి.

    ఆకట్టుకోలేకపోయిన మూవీ

    ఆకట్టుకోలేకపోయిన మూవీ

    ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా విడుదలైనా కూడా చాలా తక్కువ కలెక్షన్స్ అయితే నమోదయితున్నాయి. సినిమా ఎలా ఉంది అనే టాక్ కన్నా కూడా ఆడియన్స్ ఆ సినిమా ఎంతవరకు ఎట్రాక్ట్ చేసింది? థియేటర్లోకి రప్పించే విధంగా ప్రమోషన్స్ చేస్తున్నారా లేదా అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే దోబరా విషయంలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

    తాప్సి అంచనాలు రివర్స్

    తాప్సి అంచనాలు రివర్స్

    ప్రముఖ రైటర్ గా మంచి గుర్తింపు అందుకున్న అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన దొబారా సినిమా మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇక తాప్సి ఈ సినిమా ప్రమోషన్ లో కూడా చాలా బిజీగానే కనిపించింది. మరోసారి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ కూడా ఈ సినిమాపై పెద్దగా హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు. కానీ తప్పకుండా ఆడియన్స్ ఈ సినిమాను చూసిన తర్వాత నలుగురికి చెబుతారు అని మౌత్ టాక్ ద్వారా జనాలు థియేటర్స్ కు వస్తారు అని తాప్సి నమ్మకంతో తెలియజేసిందే. కానీ ఆమె అంచనాలు రివర్స్ అయ్యాడు.

    జనాలు రాకపోవడంతో..

    జనాలు రాకపోవడంతో..

    అయితే శుక్రవారం విడుదలైన దోబారా సినిమాకు దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. అసలు కనీసం మెయిన్ సెంటర్స్ లో కూడా ఈ సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేదు. కనీసం రెండు మూడు థియేటర్లలో కూడా జనాలు సగం కూడా నిండలేదు అంటే పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు జనాలు రాకపోవడంతో చాలాచోట్ల షోలను కూడా క్యాన్సల్ చేయాల్సి వచ్చింది.

    కలెక్షన్స్ ఎంత రావచ్చంటే..

    కలెక్షన్స్ ఎంత రావచ్చంటే..

    ఒకప్పుడు తాప్సి కొన్ని మంచి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకుంది. ఆమె మూవీకి మొదటి రోజు మినిమం కలెక్షన్స్ అందేవి. కానీ ఇప్పుడు మాత్రం దోబారా సినిమా విషయానికి వచ్చేసరికి 1 నుంచి 2 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ కనిపించడం డిస్ట్రిబ్యూటర్లను కూడా షాక్ కు గురి చేసింది. మొదటి రోజు 20 నుంచి 35 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ రావచ్చని సమాచారం. ఇక సినిమా టోటల్ గా కోటిన్నర కలెక్షన్స్ అందుకోవడం కూడా అనుమానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    రెండవ రోజు అదే పరిస్థితి

    రెండవ రోజు అదే పరిస్థితి

    ఇటీవల ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమాను ఎంతో ప్రమోట్ చేసినప్పటికీ కూడా మొదటి రోజే జనాలు పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు 1300 షోలు క్యాన్సిల్ చేశారు. ఇక తాప్సి సినిమాకు కూడా అంతకంటే దారుణమైన రెస్పాన్స్ రావడంతో రెండవ రోజు కూడా సగానికి పైగా థియేటర్ల నుంచి ఈ సినిమా వెళ్లే పోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Taapsee pannu Dobaaraa movie first day shows cancelled and expected collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X