For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Taapsee Pannu రష్మీ రాకెట్‌ ఓటీటీ రిలీజ్.. దిమ్మతిరిగేలా ప్రీ రిలీజ్ బిజినెస్

  |

  దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో తాప్సీ పన్ను తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరుచుకొన్నారు. కథాబలం ఉన్న చిత్రాల్లో నటిస్తూ అవార్డుల రివార్డులు అందుకొంటున్నారు. తాజాగా ఆమె నటించిన తప్పడ్ చిత్రం అవార్డులతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఇక రానున్న సినిమాల్లో కంటెంట్‌కు స్కోప్ ఉన్న లూప్ లపేటా, అన్నాబెల్లే సుబ్రమణ్యం, జనగణమన, దోబారా, ఏలియన్, శభాష్ మిత్తు, మిషాన్ ఇంపాజిబుల్, బ్లర్ సినిమాల్లో నటిస్తున్నారు.

  తప్పడ్, హసీన్ దిల్‌రుబా చిత్రాల రిలీజ్ తర్వాత ఆమె రష్మీ రాకెట్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నది. ఈ సినిమాను యూరీ: సర్జికల్ స్ట్రైక్స్ లాంటి చిత్రాన్ని రూపొందించిన ఆర్ఎస్వీపీ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి రోని స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ ఖాండియా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఆకాశ్ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు.

  Taapsee Pannus Rashmi Rocket set to OTT release

  Bigg Boss OTT ఫేమ్ దివ్య అగర్వాల్.. గ్లామరస్, బ్యూటీఫుల్.. ఎప్పుడూ చూడని ఫోటోలు

  రష్మీ రాకెట్ చిత్రం కథ ఏమిటంటే.. మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి అథ్తెట్‌గా మారాలని, అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలువాలని కలలు కంటుంది. ఈ చిత్రంలో అథ్లెట్ పాత్రలో తాప్సీ పన్ను నటించింది. ఈ చిత్రంలో సుప్రియా పాథక్, అభిషేక్ బెనర్జీ, ప్రియాంశు పెయిలీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం తాప్సీ ప్రత్యేక శిక్షణ పొందారు. పలు రకాల వర్కవుట్స్ చేసినట్టు తెలియజేశారు.

  Happy Birthday Jacqueline Fernandez.. బికినీలో బాలీవుడ్ భామ విశ్వరూపం!

  రష్మీ రాకెట్ చిత్రం ప్రారంభం నుంచి తాప్సీ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ సినిమాపై అంచనాలను, ఆసక్తిని పెంచారు. అయితే నవంబర్‌లో షూటింగు ప్రారంభించి జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొన్నది. రాంచీలో ఎక్కువ భాగం ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ చిత్రం లాక్‌డౌన్ పరిస్థితు కారణంగా విడుదలకు నోచుకోలేకపోయింది. అయితే థియేటర్లలో రిలీజ్ అయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేశారు.

  అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలతో షాకిచ్చిన రుహానీ శర్మ: సినిమాల్లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

  అయితే రష్మీ రాకెట్ చిత్రానికి ఓటీటీ‌ కోసం భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 58 కోట్ల రూపాయల మేరకు డిజిటల్ రిలీజ్ రైట్స్ అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నారు. అయితే ఏ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు? ఎప్పుడు రిలీజ్ చేసే అంశాలను గోప్యంగా ఉంచారు. సమయాన్ని బట్టి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.

  నటీనటులు: సుప్రియా పాథక్, అభిషేక్ బెనర్జీ, ప్రియాంశు పెయిలీ
  దర్శకత్వం: ఆకాశ్ ఖురానా
  నిర్మాతలు: రోని స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజై ఖందియా
  రచన: నంద పెరియస్వామి, అనిరుద్ద గుహా, కనికా థిల్లాన్
  సినిమాటోగ్రఫి: నేహా పర్తి మతియానీ
  బ్యానర్: RSVP మూవీస్, మ్యాంగో పర్పుల్ మీడియా నెట్ వర్క్
  రిలీజ్: ఓటీటీ

  English summary
  Actress Taapsee Pannu's Rashmi Rocket set to digital release. This movie is sold for 58 crores
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X