Don't Miss!
- News అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
చైనాలో వసూళ్ల సునామీ... రాధికా ఆప్టే, టబు సినిమా మ్యాజిక్.. కోట్ల కనక వర్షం
Recommended Video
బాలీవుడ్లో థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన అంధాదున్ చైనా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నది. టుబు, రాధికా ఆప్టే, ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రం చైనాలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్నది. మర్డర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధించిందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఏక్ హసీనా థి, బద్లాపూర్ లాంటి చిత్రాలు నిర్మించిన శ్రీ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రూ.300 కోట్లు వసూళ్లు
బాలీవుడ్లో విజయవంతమైన అంధాదున్ చిత్రం చైనాలో ది పియానో ప్లేయర్‌గా రిలీజైంది. డార్క్ కామెడీగా రూపొందించని ఈ చిత్రం రికార్డు స్థాయిలో సోమవారం నాటికి రూ.300 కోట్లు (43.4 అమెరికన్ డాలర్లు) వసూలు చేసింది అని నిర్మాతలు వెల్లడించారు. బాలీవుడ్లో కూడా ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా భారీ వసూళ్లను సాధించింది.
దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ తర్వాత
చైనాలో అంధాదున్ చిత్రం మరో అరుదైన రికార్డు సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం చైనా బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ వసూళ్లను సాధించిన మూడో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ తర్వాత ఆ రేంజ్లో వసూళ్లను సాధిస్తుండటం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లను సాధించే అవకాశం ఉంది.
చైనాలో భారతీయ సినిమాల హవా
ఇటీవల కాలంలో చైనాలో భారతీయ చిత్రాలకు చైనాలో అత్యంత ఆదరణ కనిపిస్తున్నది. సల్మాన్ ఖాన్ భజరంగీ భాయ్‌జాన్, అమీర్ ఖాన్ దంగల్, రాజమౌళి రూపొందించిన బాహుబలి, ఇర్ఫాన్ ఖాన్ నటించిన హిందీ మీడియం చిత్రాలు అక్కడ ఘన విజయం సాధించాయి. దీంతో ఇప్పుడు భారతీయ సినీ నిర్మాతలు చైనా మార్కెట్‌పై కన్నేశారు.
శ్రీరాం రాఘవన్ విజన్ కారణం
చైనాలో అంధాదున్ సినిమా ఘన విజయం సాధించడంపై హీరో ఆయుష్మాన్ ఖురానా ఆనందంలో మునిగి తేలుతున్నాడు. పొరుగు దేశంలో మా చిత్రం రూ.300 కోట్లు వసూలు చేయడం చాలా గర్వంగా ఉంది. శ్రీరాం రాఘవన్ విజన్, ప్రేక్షకుల అభిరుచి ఈ సినిమా సక్సెస్‌కు కారణం అని అన్నారు. భారతీయ చిత్రానికి ఇంత ఆదరణ కల్పిస్తున్న చైనా ప్రేక్షకులకు నా అభినందనలు అని అన్నారు.