మహేష్ కి సైన్ చెయ్యలేదు: తమన్నా తండ్రి
మహేష్ బాబు తో సుకుమార్ దర్సకత్వంలో తమన్నా హిరోయిన్ గా సైన్ చేసిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మేము ఇప్పటివరకూ ఆ సినిమాని సైన్ చెయ్యలేదు అంటూ ఖండించారు తమన్నా తండ్రి. తమన్నా డేట్స్ వివాదం ఫిల్మ్ ఛాంబర్ పరిధిలో నలుగుతున్న నేపధ్యంలో ఆయన మీడియాతో ఇలా స్పందించారు. ఆమె వరసగా సినిమాలు ఒప్పేసుకుంటూ దేనికీ పూర్తి న్యాయం చేయలేకపోతోందని,డేట్స్ ఎడ్జెస్ట్ చెయ్యలేకపోతోందంటూ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్స్ నమోదు అయ్యాయి. దాంతో ఈ విషయం చర్చకు వచ్చింది.
ముగ్గురు నిర్మాతలకు డేట్స్ ఇచ్చి ఇబ్బంది గురి అవుతున్నారని కంప్లైంట్ కావటంతో ఆమె కొత్తగా ఇవి పూర్తి కాకుండా ఏమీ ఒప్పుకోకూడదని కండీషన్ పెట్టారు. దాంతో ఆమె ఒప్పుకునే సినిమాలపై నిఘా నేత్రం ఉంటోంది. ఆమె వల్లే రచ్చ చిత్రం నెల రోజుల పాటు లేటైందని,ఎందుకంటే ప్రేమంటే కూడా నిదానంగా నడుస్తోంది అంటున్నారు. అయితే ఆమె తండ్రి మాత్ర ఇవన్ని నిరాధారమైన వార్తలే అని కొట్టిపారేస్తున్నారు. ఒక నిర్మాత ఎగస్ట్రా డేట్స్ కావాలనటంతో ఈ సమస్య వచ్చి పడింది. ఇప్పుడన్నీ సర్దుకుంటున్నాయి అన్నారు. ఇక సుకుమార్,మహేష్ బాబు చిత్రంలో తమన్నా నటిస్తుందా లేదా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాలి.


Click it and Unblock the Notifications











