twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజిత్ ‘ఆరంభం’తెలుగు బిజినెస్ ...డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : అజిత్‌, నయనతార జంటగా విష్ణువర్దన్‌ (పంజా డైరక్టర్) దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'ఆరంభం'. ఈ చిత్రం తమిళనాట అక్టోబరు 31న విడుదలైంది. ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. దాంతో చండి నిర్మాత శ్రీనుబాబు...కి 3.75 కోట్లుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం డిస్ట్ర్రిబ్యూషన్ సైడ్ కూడా మంచి డిమాండ్ వచ్చిందని చెప్తున్నారు. శాటిలైట్ రైట్స్ నిమిత్తం రెండు కోట్లు,నైజాం ఏరియాకు 1.25 కి అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం ఐదు కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

    కథలో అశోక్(అజిత్),మాయ(నయనతార),అర్జున్(ఆర్య)కలిసి ఓ మిషన్ పై పనిచేస్తూంటారు. అర్జున్ ఓ కంప్యూటర్ హ్యాకర్. హై సెక్యులర్ సిస్టమ్స్ వారు హాక్ చేస్తూంటారు. ఆర్య గర్ల్ ప్రెండ్ అనిత(తాప్సి) ఓ జర్నలిస్ట్. ఆమె కూడా ఈ డ్రామా లో ఉపయోగపడుతుంది. అశోక్ ఓ లా బ్రేకర్ గా కనిపిస్తాడు. అయితే అసలు అశోక్ అలా ఎందుకు మారి...ఇతర సిస్టమ్స్ ని హ్యాక్ చేయాల్సి వచ్చింది అనేది సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో సంజయ్(రానా) పూర్ క్వాలిటీ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్స్ వాడటం వల్ల మరణిస్తాడు. సంజయ్ ...అశోక్ కి క్లోజ్ ప్రెండ్. తన స్నేహితుడు మరణానికి కారణమైన క్రిమినల్స్ పని పట్టడానికి ఇలా అశోక్..లా బ్రేకర్ గా మారి... యుద్దం చేస్తున్నాడన్నమాట. ఇంతకీ ...అతను ఈ విషయంలో సక్సెస్ అయ్యాడా... కథలో మెయిన్ ట్విస్ట్ ఏమిటి అనేది మిగతా కథ.

    సత్యసాయి మూవీస్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు అనువాద హక్కులను చండీ నిర్మాత డా.శ్రీనుబాబు.జి సొంతం చేసుకున్నారు. అవినీతి, మోసం, ప్రతీకారం ప్రధానాంశాలతో రూపొందిన ఈ చిత్రం కథ బుల్లెట్ ఫ్రూప్ జాకెట్స్ స్కామ్ ఆధారంగా రూపొందింది. రెగ్యులర్ రొటీన్ ..రివేంజ్ కాన్సెప్ట్ అయినా చెప్పిన నేరేషన్ ప్రేక్షకులను కట్టిపారేస్తోంది. అజిత్ కెరీర్ లో మరో పెద్ద ఘన విజయం సాధించిన చిత్రంగా దీన్ని చెప్తున్నారు.

    ఈ సందర్భంగా డా.శ్రీనుబాబు మాట్లాడుతూ ' అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అనువాద హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది. ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కుల్ని మేం పొందాం. అజిత్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తాం. త్వరలోనే అనువాద కార్యక్రమాలు ప్రారంభిస్తాం' అని తెలిపారు.ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఫొటోగ్రఫీ: ఓంప్రకాశ్, నిర్మాత: డా.శ్రీనుబాబు జి., దర్శకత్వం: విష్ణువర్థన్.

    English summary
    The Telugu dubbing rights of ‘Aarambam’ film were sold for 3.75 Crs to Dr Srinubabu G the producer of Priyamani's ‘Chandi’. Srinubabu who has lost big amounts in ‘Chandi’ wants to regain it on telugu dubbing version of ‘Aarambam’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X