టాలీవుడ్ లో తమిళ హీరోల హవా.. ఇటీవల కాలంలో తెలుగులో అత్యధిక ఒపెనింగ్స్ అందుకున్న టాప్ మూవీస్!
తమిళ స్టార్ హీరోలకు ఇటీవల కాలంలో అయితే బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ లు అందుతున్నాయి. ఒకప్పుడు రజనీకాంత్ కమల్ హాసన్ ఇక్కడ డైరెక్ట్ గా స్టార్ హీరోల రేంజ్ లో సక్సెస్ అందుకునేవారు. కానీ మధ్యలో తమిళ హీరోలకు అంతగా సక్సెస్ రాలేదు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం అక్కడి స్టార్ హీరోలు మంచి కంటెంట్ తో వచ్చి హిట్ టాక్ అందుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో వచ్చిన తమిళ డబ్ సినిమాలకు తెలుగులో ఓపెనింగ్స్ అయితే గట్టిగానే వచ్చాయి. ఇక ఆ సినిమాల వివరాల్లోకి వెళితే..

కోబ్రాతో బెస్ట్ ఒపెనింగ్స్
విక్రమ్ నటించిన కోబ్రా సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంది. ఒకప్పుడు అపరిచితుడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విక్రమ్ కు ఆ తర్వాత ఆ రేంజ్ లో సక్సెస్ రాలేదు. ఇక మళ్ళీ అతను కోబ్రా సినిమాతో 2.28 కోట్ల రేంజ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక రజనీకాంత్ కూడా చాలా వ్యాప్ తర్వాత పెద్దన్న సినిమాతో కోటి 60 లక్షల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.

విక్రమ్ తో కమల్ బౌన్స్ బ్యాక్
ఇక కమల్ హాసన్ చాలాకాలం తర్వాత విక్రమ్ సినిమాతో తెలుగులో మళ్లీ తన మార్కెట్ను వెనక్కి తెచ్చుకున్నాడు. ఆ సినిమా తెలుగులో ఫస్ట్ డే 1.96 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇక ఆ సినిమాను నితిన్ తెలుగులో రిలీజ్ చేయగా 10 కోట్లకు పైగా లాభాలను అందించింది. అలాగే కార్తీ కూడా సర్దార్ సినిమాతో మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు ఆ సినిమా తొలి రోజు తెలుగులో 96 లక్షల షేర్ కలెక్షన్ సొంతం చేసుకుంది.

మణిరత్నం కూడా హిట్ కొట్టేశాడు
ఇక తమిళ దర్శకుడు మణిరత్నం తన బ్రాండ్ ఇమేజ్ తో గతంలో అయితే తెలుగులో కూడా మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇక చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.88 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఆ సినిమాలో తమిళ ప్రముఖ తారాగణం ఉండడం వలన మంచి బజ్ ఏర్పడింది.

లవ్ టుడే సాలీడ్ కలెక్షన్స్
ఇక పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన లవ్ టుడే సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో విడుదల చేయగా మొదటి రోజే 1.15 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. ఇక పూర్తిస్థాయిలో ఈ సినిమా అయితే తెలుగు బయ్యర్లకు మంచి లాభాలను అందించాయి. అలాగే అజిత్ తెగింపు సినిమా మొదటి రోజు 1.14 కోట్ల కలెక్షన్స్ అందుకుంది.

వారసుడు కూడా..
ఇక ఇటీవల సంక్రాంతికి విజయ్ వారసుడు సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారసుడు సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 3.10 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. విజయ్ కెరీర్ లోనే తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఓపెనింగ్ నెంబర్ నెంబర్ నమోదయింది.

సార్ తో ధనుష్ రికార్డ్
ఇక రీసెంట్ గా ధనుష్ సార్ సినిమా ద్విభాషా చిత్రంగా విడుదలైంది. తెలుగులో మొదటిసారి ధనుష్ బెస్ట్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సీతార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 450 కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఇక ఫస్ట్ డే తెలుగులో 2.65 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ధనుష్ కెరిర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా సార్ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











