తమిళ సాంబారు ఇల్లే(ట్రేడ్ టాక్)
ఈ వారం కూడా తమిళ రీమేక్ బిల్లా, తమిళ డబ్బింగ్ సచిన్ చిత్రాలు రిలీజయ్యాయి. బిల్లా భారీ ఎత్తున హైప్ క్రియేట్ చేసి ఒక్కసారి కుదేలై కూలపడింది. మొదటి రెండు రోజులు ఉన్న కలెక్షన్స్ లో పావు వంతు కూడా తర్వాత రోజుల్లో కన్పడకపోవటం అందరినీ భయపెడ్తోంది. అసలే డెఫిషిట్ తో రిలీజైన ఈ చిత్రం అందరికీ నిరాశని మిగిలిస్తూ బుల్ షిట్ అన్పిస్తోంది. అందులోనూ కంత్రి దర్శకుడు మొహర్ రమేష్ రైట్స్ తీసుకున్నాం కదా అని షాట్ డివిజన్ తో సహా కాపీ కొట్టి, కొద్ది పాటి క్రియేటివిటిని కూడా చూపకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అలా బిల్లా కథ ముగిస్తే..జెనీలియా, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన సచిన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అర్ధం పర్ధం లేని ప్రేమ కథకు కంగాళి ఫైట్స్, వడివేలు బోర్ హాస్యం గట్టెక్కించలేకపోయాయి. ఇక ఇంతకాలం టాప్ ప్లేస్ లో ఉన్న అరుంధతి సినిమా కలెక్షన్స్ పరంగా బాగా వీక్ అవటం విశ్లేషకులను ఆలోచనలో పడేస్తోంది. చూడాలని ఆశపడిన వారంతా చూసేయటం..రిపీట్ ఆడియన్స్ లేకపోవటమే ఈ కలెక్షన్ డ్రాప్ కి కారణమని తేలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











