Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రీమేక్ ఫ్లాఫ్..డబ్బింగ్ టాప్ (ట్రేడ్ టాక్)
క్రితం వారం వరుణ్ సందేశ్ హీరోగా చేసిన కుర్రాడు వచ్చింది. తమిళ హిట్ పొల్లాదవన్ కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం భాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇన్నాళ్ళూ లవర్ బోయ్ గా అలరించిన వరుణ్ ఈ సినిమాలో కండలు చూపి మరీ ఫైట్స్ చేయటం ప్రేక్షకులుకు పట్టలేదు. అంతేగాక హీరోయిన్ గా చేసిన చిరుత ఫేం నేహా శర్మ కూడా ఈ చిత్రం ఫ్లాఫ్ కు మరో కారణంగా నిలిచింది. దర్శకుడు గుణ్ణం గంగరాజు కుమారుడు..సందీప్ కావటంతో ఏదైనా కథా పరంగా కొత్తదనం ఉంటుందని ఆశించి వెళ్ళిన వారికి సైతం ఈ చిత్రం నిరాశను మిగిల్చింది. అలాగే ఈ చిత్రంతో పాటు ఒరిజనల్,పదహేరేళ్ళ వయస్సు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అవి రిలీజైన సంగతి కూడా చాలా మందికి తెలియనంత సైలెంట్ గా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఇక బి, సి సెంటర్లలో బెండు అప్పారావు కలెక్షన్స్ బాగున్నాయి. మగధీర చాలా చోట్ల వంద పూర్తి చేసుకుంది. అలాగే 2012 యుగాంతం అనే హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం మాత్రం కలెక్షన్స్ కుమ్ముకుంటోంది. దాంతో మరిన్ని హాలీవుడ్ చిత్రాలు డబ్బింగ్ అయ్యే అవకాశం ఉంది.