Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
అజిత్, తమన్నా కాంబినేషన్ లో ...‘వీరుడొక్కడే’
హైదరాబాద్ : 'ఆరంభం' చిత్రంతో తనకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉందని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు అజిత్. ఆయన తాజా చిత్రం వీరం ను ఇప్పుడు తెలుగులో 'వీరుడొక్కడే' టైటిల్ తో విడుదల చేయటానికి నిర్మాతలు విజయ ప్రొడక్షన్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో శంఖం, శౌర్యం, దరువు చిత్రాలు డైరక్ట్ చేసిన శివ దర్శకుడు కావటంతో ఇక్కడ వారికి తగ్గ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడని, హిట్ కొడతారని నమ్మకంగా ఉన్నారు. ఆట ఆరంభం నిర్మాత శీను బాబు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడని ట్రేడ్ టాక్.
ఓమిక్స్ క్రియేషన్స్ పతాకంపై డా.శ్రీనుబాబు జి. తమిళంలో విజయవంతమైన 'వీరం' చిత్రానికిసంబంధించినతెలుగు హక్కులు పొందారు. అజిత్, తమన్నా జంటగా శివ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'వీరుడొక్కడే' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనుబాబు మాట్లాడుతూ నిర్మాతలకు ఆదర్శప్రాయులైన విజయానాగిరెడ్డి శత జయంతి జరుపుకుంటున్న సంస్థ నిర్మించిన 'వీరం' హక్కులు గట్టిపోటీ ఎదురైనా తమకు లభించినందుకు ఆనందంగా వుందని, ఆట ఆరంభం చిత్రానికి తాము చేసిన ప్రమోషనే ప్లస్‌గా మారిందని ఆయన అన్నారు.
అజిత్, తమన్నా జంట ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరిస్తుందని, వారిపై చిత్రీకరించిన పాటలు అందరికీ నచ్చుతాయని తెలుగుతనంతో ఉట్టిపడే రాజమండ్రి, అరకులోయ, ఆర్ఎఫ్సిలలో షూటింగ్ ప్రత్యేక ఆకర్షణ అని ఆయన తెలిపారు. ట్రైన్ ఫైట్ హైలెట్‌గా నిలిచే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు జనవరిలో విడుదలవుతాయని, అదేనెల చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రదీప్‌రావత్, నాజర్, సంతానం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: వెట్రి, నిర్మాత: డా.శ్రీనుబాబు జి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ.