గుడ్ బ్యాడ్ అగ్లీకి అజిత్ రెమ్యునరేషన్ ఎంత? తలా టోటల్ ఆస్తులు ఎంత?
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజాగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఈ మూవీలో ఆయనకు జోడీగా నటించింది. రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాతలు నవీన్ ఏర్నేని, రవి శంకర్ నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఇండియాలోనూ ప్రధాన ప్రాంతీయ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.
గత చిత్రాల రెమ్యూనరేషన్స్..
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో అజిత్ కుమార్ మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ ను అందుకున్నట్టు కనిపిస్తోంది. ఇక కమర్షియల్ హిట్ గా నిలుస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు అజిత్ కుమార్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రతి సినిమాకు అజిత్ కుమార్ రూ.105 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటాని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తునివు, విడాముయార్చి, చిత్రాలకు రూ.70 కోట్లు, ప్రాఫిట్స్ అందుకున్నారని తెలుస్తోంది. ఇక 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రానికి ఏకంగా రూ.110 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని కోలీవుడ్ సినీ ప్రముఖులు తెలుపుతున్నారు.

అజిత్ కుమార్ ఆస్తుల నికర విలువ..
కోలీవుడ్ స్టార్ గా అజిత్ కుమార్ ఇప్పటి వరకు 61 చిత్రాల్లో నటించారు. చాలా వరకు హిట్స్ అందుకున్నారు. మరోవైపు అజిత్ రేసర్ కూడా కావడం విశేషం. స్టోర్ట్స్ పర్సన్ గా, నటుడిగా అజిత్ తన జీవితంలో చాలానే కూడబెట్టారు. చెన్నైలోని ఓ విలాసవంతమైన భవనం, లగ్జరీ కార్లు, పలు ప్రాపర్టీస్ తో కలిసి అజిత్ నెట్ వర్త్ రూ.420 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఇక అజిత్ ఫోర్బ్స్ 100 లిస్ట్ లో చేరడం కూడా అతను ఇండియాలో రిచ్ యాక్టర్ అని తెలియజేస్తోంది.
తమిళ స్టార్ అజిత్ ఫ్యామిలీ వివరాలు..
అజిత్ కుమార్ 1971లో కేరళలో జన్మించారు. తండ్రి సుబ్రహ్మణ్యం. తల్లి మోహిని. అజిత్ కు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. అజిత్ మధ్య వాడు. అన్న అనిల్ కుమార్, వ్యాపారవేత్త. తమ్ముడు అనుప్ కుమార్ ఉన్నారు. 2000లో నటి షాలినీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి 2008లో కూతురు అనౌష్క, 2015లో కొడుకు అధిక్ జన్మించారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కలెక్షన్లు..
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ల అందుతుండటం విశేషం. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం భారీగా వసూళ్లను రాబడుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో రూ.170 కోట్లకు పైగా వసూళ్లు అందాయి. మరోవైపు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం జోరుగా కలెక్షన్లను రాబడుతోంది. మొదటి వారంలోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరుకునే అవకాశం కనిపిస్తోంది. 240 కోట్ల గ్రాస్ వసూళ్లు చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కానుంది.


Click it and Unblock the Notifications











