Thangalaan: 100 కోట్ల క్లబ్‌లో విక్రమ్ మూవీ.. ఆ రికార్డు బ్రేక్..
Thangalaan: తమిళ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన మూవీ 'తంగలాన్'. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన థియేటర్లలో తమిళం, తెలుగు, తమిళ్ పలు భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. విడుదలైన రోజు ఏకంగా 26 కోట్లు రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోయింది.
చియాన్ విక్రమ్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు రాబట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. బాక్సాఫీసును షేక్ చేసిన ఈ మూవీ హిందీ వెర్షన్‌లో ఈ నెల (సెప్టెంబరు)6 వ తారీకున గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా బాలీవుడ్‌లో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది మూవీ టీం. అయితే పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

ఈ మేరకు మూవీ మేకర్స్ స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓ ప్రకటనలో విడుదల చేసి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం చిత్ర బృందం ఈ ఆనందంలో పండుగ చేసుకుంటోంది. తరతరాలుగా చెన్నై నుంచి కోలార్‌కు వలస వచ్చిన నివాసితులు నివసించే ప్రదేశంలో ఈ మూవీ చిత్రికరించారు. తంగలాన్ భారీ హిట్ కొట్టడానికి కారణమైన నటీనటులెవరంటే.. పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ మూవీలో చియాన్ విక్రమ్ హీరోగా నటించగా, మాళవిక మోహన్ హీరోయిన్ నటించింది. పార్వతి, పశుపతి, డేనియల్ కాల్టాడిరోన్ వంటీ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
కోలార్ బంగారు గనుల నేపథ్యంలో అణగారిన ప్రజల వాస్తవికతను, జీవన, హక్కుల పోరాటంపై సాగే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. తంగలాన్‌లో ప్రతి ఒక్కరి యాక్టింగ్ అదిపోవడంతో బాక్సాఫీసు బద్ధలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చియాన్ విక్రమ్ యాక్టింగ్ అదిపోయిందని చెప్పడంలో అతిశక్తిలేదు.

ఇక నటుడు చియాన్ విక్రమ్ సైడ్ క్యారెక్టర్ రోల్స్‌లో నటిస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు, మలయాళ, తమిళం వంటి భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన శివ పుత్రుడు, శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు, కోబ్రా, మల్లన్న, సమురాయ్ సేతు నాన్న, విలన్, ఐ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించారు. అద్భుతమైన నటనతో సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం తంగలాన్ చిత్రం భారీ వసూళ్లు కొల్లగొట్టారు. ఈ సినిమాతో చియాన్ విక్రమ్ రేంజ్ మరింతగా పెరిగింది.


Click it and Unblock the Notifications











