తనీష్ లేటెస్ట్ రిలీజ్ ‘తెలుగబ్బాయి’ రిజల్ట్
హీరో తనీష్ మాట్లాడుతూ 'మేం వయసుకు వచ్చాం' చిత్రం సక్సెస్ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ ఇది. తెలుగబ్బాయి నటుడిగా నాకు మరింత మంచి పేరు, గుర్తింపు తీసుకొస్తుంది. నా కెరీర్లో తెలుగబ్బాయి వన్ ఆఫ్ ది కాస్టిలియస్ట్ అండ్ స్టైలిష్ మూవీ అవుతుంది' అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... 15,16 సంవత్సరాల నుంచి సినీ రంగంలో ఉంటున్న నాకు దర్శకుడిగా తొలి చిత్రం 'తెలు గబ్బాయి'. గతంలో నటి, దర్శకురాలు రేవతి వద్ద కొంతకాలం పాటు దర్శకత్వ విభాగంలో పనిచేశాను. ఇక ఏప్రిల్‌లో ఓ పెద్ద హీరోతో పీరియాడికల్ మూవీ తీసేందుకు ప్లాన్‌చేశాను. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తాము. యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెలుగబ్బాయి చిత్రాన్ని రూపొందించాను. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈచిత్రంలో ఉంటాయి. తనీష్ లుక్, తషు కౌశిక్ గ్లామర్, యాక్షన్ ఎపిసోడ్స్ ఈచిత్రానికి హైలెట్స్ అన్నారు.
తనీష్, రమ్య నంబీశన్, తషు కౌశిక్, నాగబాబు, లోహిత్, సోనా నాయర్, అనన్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ప్రతాప్.వి.కుమార్, ఎడిటింగ్ ఓ. రవిశంకర్, పాటలు జె.ఎస్. నివాస్, సంగీతం : మెజో జోసఫ్, రీ-రికార్డింగ్ : ఎస్వీ ఈశ్వర్, సమర్పణ : ఎస్. కళై వాణి, నిర్మాత : ఎస్. రామకృష్ణ, రచన, దర్శకత్వం, ఓ.ఎస్. అవినాష్


Click it and Unblock the Notifications












